Supreme Court: కవితకు ఎందుకు బెయిల్ ఇవ్వలేదు? హైకోర్టుపై ఆగ్రహం
Supreme Court: ఢిల్లీ లిక్కర్ కేసులో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎట్టకేలకు ఈరోజు బెయిల్ వచ్చింది. దాదాపు గంటన్నర పాటు వాదోపవాదాలు విన్న సుప్రీంకోర్టు నాలుగు నెలల తర్వాత కవితకు బెయిల్ మంజూరు చేసింది. కవిత కేసులో భాగంగా తీర్పు వెల్లడిస్తూ సుప్రీంకోర్టు ఢిల్లీ హైకోర్టుపై మండిపడింది. ముందు బెయిల్ కోసం కవిత హైకోర్టును ఆశ్రయించగా.. అక్కడ సెక్షన్ 45 ప్రకారం కవితకు బెయిల్ రావాల్సి ఉంది.
కానీ కవిత విద్యావంతులు కావడం.. అందులోనూ రాజకీయ నాయకురాలు కావడంతో ఆమెకు బెయిల్ ఇవ్వలేదు. దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ.. సెక్షన్ 45 విషయంలో సున్నితంగా వ్యవహరించాలని హైకోర్టుకు తెలీదా అని మండిపడింది. సెక్షన్ 45 ప్రకారం బెయిల్ కేవలం దుర్బల మహిళకు మాత్రమే వస్తుందని హైకోర్టు భ్రమలో ఉందా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. సెక్షన్ 45 గురించి ఇంకాస్త స్టడీ చేసి ఉంటే ఈపాటికే కవితకు బెయిల్ వచ్చేసేదని సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది.
ఇక కవితకు బెయిల్ ఇచ్చినంత మాత్రాన ఆమె దేశం విడిచి వెళ్లడానికి లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ప్రతి 15 రోజులకు లేదా నెల రోజులకు విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. సాక్ష్యులను ప్రభావితం చేయొద్దని హెచ్చరించింది.