IPL: ర‌జినీ.. రుతురాజ్‌.. హ‌ర్భ‌జ‌న్ కామెంట్

Hyderabad: ఐపీఎల్(IPL) టీంలో ఉన్న ప‌వ‌ర్‌ఫుల్ టీమ్స్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్(chennai super kings) ఒక‌టి. కెప్టెన్ కూల్ మ‌హేంద్ర సింగ్ ధోనీ(dhoni) కెప్టెన్సీలో చేయి తిరిగిన బ్యాట్స్‌మెన్‌, బౌలర్లు ఉన్న టీం ఇది. చెన్నై టీం అంటే ధోనీ త‌ర్వాత అంద‌రికీ గుర్తొచ్చే పేరు రుతురాజ్ గైక్వాడ్(ruturaj gaikwad). గ‌త ఐపీఎల్ సీజ‌న్ల‌లో చూసుకుంటే రుతురాజ్(ruturaj) త‌న పెర్ఫామెన్స్‌తో ఇర‌గ‌దీసాడు. ఇప్పుడు జ‌రుగుతున్న ఐపీఎల్‌లోనూ అత‌ను అత్య‌ధిక ర‌న్స్ తీసిన బ్యాట్స్‌మెన్‌గా టాప్ ఫాంలో ఉన్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన నాలుగు మ్యాచ్‌ల‌లో రెండు హాఫ్ సెంచ‌రీలు చేసి అంద‌రి దృష్టిలో ప‌డ్డాడు. అయితే మాజీ క్రికెట‌ర్‌, స్పిన్న‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్(harbhajan singh)..రుతురాజ్ గురించి చేసిన కామెంట్ ఒక‌టి ఇప్పుడు వైర‌ల్ అవుతోంది.

నిన్న జ‌రిగిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్(RR), చెన్నై సూప‌ర్ కింగ్స్(CSK) మ్యాచ్‌లో.. ధోనీ(dhoni) దంచికొట్టిన‌ప్ప‌టికీ రాజ‌స్థానే గెలిచింది. రుతురాజ్(ruturaj) కూడా బాగానే పెర్ఫాం చేసాడు. ఈ సంద‌ర్భంగా కామెంటేట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ హ‌ర్భ‌జ‌న్ రుతురాజ్ గురించి స్పందిస్తూ.. రుతురాజ్ గైక్వాడ్.. ర‌జినీకాంత్(rajinikanth) స‌ర్‌లో కొన్ని సేమ్ పోలిక‌లు ఉన్నాయి. వారిద్ద‌రి ఇంటిపేరు ఒక్క‌టే. వారిద్ద‌రూ చెన్నై వాసులే. అంతేకాదు.. ఈ గ‌డ్డ‌పై వారికి ఉన్న అభిమానం వర్ణ‌నాతీతం అని కామెంట్ చేసాడు. దాంతో స్టేడ‌యం అంతా ద‌ద్ద‌రిల్లిపోయింది.