Credit Card Tips: ఒకరికి ఎన్ని క్రెడిట్ కార్డులుండాలి? RBI ఏం చెప్తోంది?
Credit Card Tips: ఒక్కో వ్యక్తికి ఎన్ని క్రెడిట్ కార్డులు ఉండాలి? ఒకటి కంటే ఎక్కువ కార్డులు మెయింటైన్ చేస్తే ఏదైనా సమస్య వస్తుందా? అనే సందేహాలు ఉంటాయి. ఈ విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెప్తోందో తెలుసుకుందాం.
మీ దగ్గర ఎన్ని క్రెడిట్ కార్డులున్నా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే బ్యాంకులు క్రెడిట్ కార్డులు ఇచ్చే ముందు కస్టమర్ల ఆదాయం, సిబిల్ స్కోర్, క్రెడిట్ హిస్టరీ చూడకుండా కార్డులు జారీ చేస్తే మాత్రం రిజర్వ్ బ్యాంక్ రంగంలోకి దిగుతుంది. మీకు వచ్చే ఆదాయం ఎక్కువగా ఉంటే మీకు బ్యాంకులు ఎక్కువ క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు ముందుకొస్తాయి. తక్కువ ఆదాయం ఉన్నవారికి రెండుకు మించి ఇవ్వరు. ఒకవేళ ఎక్కువ ఇవ్వాలన్నా కూడా ఇతర కార్డులను బ్లాక్ చేయించేసి వారి బ్యాంకులు ఇచ్చే కార్డులు తీసుకోవాలని చెప్తుంటాయి.
ఈ మధ్యకాలంలో ఒక్కొక్కరి వద్ద దాదాపు 10 క్రెడిట్ కార్డులు ఉంటున్నాయట. బహుశా వారి ఆదాయం నెలకు లక్ష మించి ఉండచ్చు. కాబట్టి వారికి ఎలాంటి సమస్య ఉండదు. కానీ మధ్య తరగతి కుటుంబాలకు క్రెడిట్ కార్డులు ఒక్కోసారి శాపంగానూ మారతాయి. కాబట్టి రెండుకి మించి తీసుకోకపోవడమే ఉత్తమం. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. కొన్ని బ్యాంక్ యాప్స్ 5 నిమిషాల్లో ఇంత లోన్ ఇస్తామంటూ తెగ ఆఫర్లు ఇస్తుంటాయి. ఇలాంటి వాటికి అస్సలు వెళ్లకండి. అవి అన్నీ ఫేక్ యాప్స్. మీరు తీసుకున్న లోన్‌కి డబుల్ వసూలు చేస్తుంటాయి. కాబట్టి పర్సనల్ లోన్ కావాలన్నా లేదా ఇతర లోన్లు కావాలన్నా అధికారిక బ్యాంకులను సంప్రదించడమే ఉత్తమం.