Dolphin: మ‌నుషుల‌ను లైంగికంగా వేధిస్తున్న డాల్ఫిన్..!

a dolphin in japan is sexually harassing people on beach

Dolphin: మ‌నుషుల‌ను ఓ డాల్ఫిన్ లైంగికంగా వేధిస్తోంది..! మీరు చ‌దివింది నిజ‌మే. ఈ ఘ‌ట‌న జ‌పాన్‌లో చోటుచేసుకుంది. సెంట్ర‌ల్ జపాన్‌లోని ఫుకుయ్ ప్రాంతంలో ఉన్న బీచ్‌ల‌లో ఓ డాల్ఫిన్ నివ‌సిస్తోంది. దాని పేరు సుజు. 2022 నుంచి ఆ ఫుకుయ్ ప్రాంతంలో ఉన్న బీచ్‌ల‌లో ప‌ర్యాట‌కులు, స్థానిక వాసులు స‌ర్ఫింగ్‌కి వెళ్లినా.. లేదా స‌ర‌దాగా ఆడుకోవ‌డం కోసం నీటిలోకి దిగినా ఈ సుజు వారిని ఎటాక్ చేస్తోంద‌ట‌. కొంద‌రిని శారీర‌కంగా గాయ‌ప‌రుస్తుంటే.. మ‌రికొంద‌రిని లైంగికంగా వేధించింద‌ట‌.

ఇలా సుజు వ‌ల్ల దాదాపు 20 మంది గాయ‌ప‌డ్డారు. ఇంకొంద‌రికి ఎంత తీవ్రంగా గాయ‌ప‌డ్డారంటే ఒక చేతి వేలు తెగిపోవ‌డం.. 20 కుట్లు ప‌డ‌టం వంటి సంఘ‌ట‌న‌లు జ‌రిగాయి. 2023లో ఈ దాడులు మ‌రింత పెరిగిపోయాయ‌ట‌. దాంతో స్థానిక అధికారులు ఆ బీచ్‌ల‌లో వార్నింగ్ బోర్డులు పెట్టారు. అయితే.. నిపుణులు ఏం చెప్తున్నారంటే సుజు లాంటి డాల్ఫిన్లు తోడు దొర‌క్క లైంగిక వాంఛ తీర‌క ఇలా దాడులకు పాల్ప‌డుతుంటాయ‌ని.. వాటికి కావాల్సింది ద‌క్కేవ‌ర‌కు ఇలా దాడుల‌కు పాల్ప‌డుతూ త‌మ బాధ‌ను వ్య‌క్త ప‌రుస్తుంటాయ‌ని అంటున్నారు.

సుజుకి ఓ తోడు దొరికితే అది దాడులు చేయ‌డం ఆపేస్తుంద‌ని అంటున్నారు. ఇదొక్క‌టే కార‌ణం కాదు.. సుజుని అదే జాతికి చెందిన డాల్ఫిన్లు వెలివేయ‌డంతో కూడా అవి ఒంట‌రిత‌నాన్ని భ‌రించ‌లేక ఇలా దాడులు చేస్తుంటాయ‌ని చెప్తున్నారు.