Samantha: జ్వరంగా ఉంది.. గొంతు పోయింది
Hyderabad: నటి సమంత(samantha) శాకుంతలం(shakuntalam) సినిమాతో రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా సామ్(samantha) విరామం లేకుండా ఇంటర్వ్యూలు ఇస్తూ వివిధ షోలకు హాజరయ్యారు. మయోసైటిస్(myositis)తో బాధపడుతున్న సామ్(samantha).. రోజూ విరామం లేకుండా ప్రమోషన్స్, ఇంటర్వ్యూల్లో పాల్గొంటుండడంతో తన ఆరోగ్యంపై ప్రభావం చూపిందట. ఈ విషయాన్ని సామ్ సోషల్ మీడియాలో షేర్ చేసారు. రేపు శాకుంతలం(shakuntalam) రిలీజ్ అవబోతున్న సందర్భంగా నాకు మీ ప్రేమాభిమానాలు కావాలి. నిరంతరం ప్రమోషన్స్‌లో బిజీ అయిపోవడంతో నా ఆరోగ్యంపై ప్రభావం చూపింది. జ్వరంగా ఉంది. గొంతు పోయింది అని తెలిపారు. ఇకపోతే శాకుంతలం సినిమాకు గుణశేఖర్(guna sekhar) దర్శకత్వం వహించారు. దిల్‌రాజు(dil raju) నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్(allu arjun) కూతురు అర్హ(arha) భరతుడి పాత్రలో కనిపించనుంది.