N convention Demolish: రూ.4000 కోట్లు.. కడ్తారా.. కట్టిస్తారా?
N Convention Demolish: అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినప్పటికీ ఒక స్టార్ నటుడికి చెందిన ఏ భవనం కూడా అక్రమ కట్టడం అంటూ కూల్చి వేసింది లేదు. కానీ మొదటి సారి రేవంత్ రెడ్డి హయాంలో హైడ్రా సంస్థ నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ తుమ్మిడి చెరువును ఆక్రమించి మరీ నిర్మించారంటూ మొత్తం కూల్చేసింది. దీనిపై నాగార్జున వివరణ కూడా ఇచ్చారు. ఇంకా కోర్టులో ఈ కేసుపై స్టే ఉన్నప్పటికీ అలా ఎలా కూల్చేస్తారని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. కనీసం కూల్చే ముందు తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని అన్నారు.
రూ.4000 కోట్లు ఎవరు కడ్తారు?
అయితే.. ఈ ఎన్ కన్వెన్షన్ ద్వారా నాగార్జున దాదాపు రూ.4000 కోట్లు అర్జించారట. మరి ప్రభుత్వ భూమిలో చెరువు కబ్జా చేసి మరీ కట్టిన ఆ నిర్మాణం నుంచి ఇప్పటి వరకు సంపాదించినది ప్రభుత్వానికే చెందాలి కదా? అనే చర్చ మొదలైంది. మరి ఆ రూ.4000 కోట్లు తెలంగాణ ప్రభుత్వం వసూలు చేస్తుందా? లేదా ఇక్కడితో వదిలేస్తుందా? అనేది మున్ముందు తెలుస్తుంది.
అయితే.. తనకు చెందిన ఎన్ కన్వెన్షన్ పట్టా భూమిపై నిర్మించినదని ఆరోపిస్తూ నాగార్జున తెలంగాణ కోర్టులో పిటిషన్ వేసారు. ఇది నిజంగా పట్టా భూమే అయితే.. ఆ భవనం కూల్చేసినందుకు పరిహారం కింద తెలంగాణ ప్రభుత్వం నాగార్జునకు పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తుందనే టాక్ కూడా ఉంది.