Shikhar Dhawan: గబ్బర్ ఎంట్రీ.. సెహ్వాగ్ కెరీర్ ఖతం
Shikhar Dhawan: ఎలాంటి ఆర్భాటం లేకుండా సింపుల్‌గా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు శిఖర్ ధావన్. దాంతో గబ్బర్ ఫ్యాన్స్ పాపం ఎంతో హర్ట్ అయ్యారు. అయితే.. ధావన్ రిటైర్మెంట్ ప్రకటించగానే.. క్రికెట్ లెజెండ్ వీరేందర్ సెహ్వాగ్ చేసిన కామెంట్ వైరల్‌గా మారింది. మొహాలీలో నువ్వు నన్ను రీప్లేస్ చేసాక.. నీ టాప్ పెర్ఫామెన్స్‌లతో అసలు వెనక్కి తిరిగి చూసుకునే అవకాశమే రాలేదు. జీవితంలో ఇలాగే సంతోషంగా ఫన్నీగా ఉండాలని కోరుకుంటున్నాను అని ట్వీట్ చేసారు. దాంతో సెహ్వాగ్‌ని ధావన్ రీప్లేస్ చేయడం ఏంటి అని చాలా మందికి డౌట్ వచ్చి ఉంటుంది. శిఖర్ క్రికెట్ రంగంలో ఇంతగా ఎదగడానికి ఓ బలవంతపు చర్య ఉంది. ఆ స్టోరీ ఏంటంటే..
2010లో 27 ఏళ్ల వయసులో ధావన్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌ను మొదలుపెట్టాడు. 2013 నుంచి 2023 వరకు ODIల్లో కీలక ఆటగాళ్లలో ఒకరిగా గబ్బర్ నిలిచాడు. 2013లో ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో ధావన్‌ను అదృష్టం తలుపు తట్టింది. కేవలం 85 బంతుల్లో 100 పరుగులు తీసిన డెబ్యుటెంట్‌గా చరిత్ర సృష్టించాడు. అయితే.. ఈ మ్యాచ్‌లో అసలు ధావన్ ఆడాల్సింది కాదు. కానీ మాజీ సెలెక్టర్ సందీప్ పాటిల్ వీరేందర్ సెహ్వాగ్ ఫాం పడిపోతోందని గ్రహించి.. అతని స్థానంలో ధావన్‌ను పెట్టాలని భావించాడు. అలా ఎంతో బలవంతం చేస్తే కానీ ధావన్ ఆడేందుకు వెళ్లలేదు. ఆ రోజు సందీప్ ధావన్‌ను బలవంతం పెట్టకపోయినా ధావన్ మనసు మార్చుకుని ఆడేందుకు వెళ్లకపోయినా అతని కెరీర్ అక్కడితో ఆగిపోయేదే..! అలా ధావన్ తన ప్రతిభను నిరూపించుకోవడంతో అక్కడితో సెహ్వాగ్ కెరీర్‌కు ఫుల్ స్టాప్ పడిపోయింది.