Nara Rohith: నా సినిమా ఫ్లాప్.. వ‌చ్చిన‌ట్లు కూడా ఎవ్వ‌డికీ తెలీదు

Nara Rohith accepts prathinidhi 2 is a flop

Nara Rohith: సుంద‌ర‌కాండ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు నారా రోహిత్. అయితే ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆయ‌న న‌టించిన ప్ర‌తినిధి 2 సినిమా మంచి ఇంపాక్ట్ సృష్టిస్తుంద‌ని అంతా అనుకున్నారు. అయితే.. అస‌లు ఆ సినిమా ఆడ‌లేద‌ని.. ఆ సినిమా వ‌చ్చిన‌ట్లు కూడా ఎవ్వ‌డికీ తెలీన‌ది రోహిత్ కామెంట్ చేయ‌డం వైరల్‌గా మారింది.

సుంద‌రకాండ ప్రెస్‌మీట్‌లో ప్ర‌తినిధి సినిమా లాగే ప్ర‌తినిధి 2 కూడా హిట్ అయ్యింది కాబ‌ట్టి ప్ర‌తినిధి 3 మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా అని ఓ విలేఖ‌రి అడ‌గ్గా.. ప్రతినిధి 2 ఎక్క‌డ హిట్ అయ్యిందండీ బాబూ..! అస‌లు ఆ సినిమా వ‌చ్చిన‌ట్లు కూడా ఎవ్వ‌డికీ తెలీదు. ఇప్పుడు నేను ప్ర‌తినిధి 3 గురించి చెప్తే అసలు 2 ఫ్లాప్ అయ్యింది మ‌ళ్లీ 3 అంట అని మీరే రాసేస్తారు క‌దా అని రోహిత్ అన‌డంతో మీడియా మొత్తం ప‌గ‌ల‌బ‌డి న‌వ్వ‌కున్నారు.