Kolkata Rape Case: ఆ 29 నిమిషాలు రేప్ అండ్ మర్డర్
Kolkata Rape Case: కలకత్తా అత్యాచార ఘటన విషయంలో రోజుకో షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. నిందితుడు సంజయ్ రాయ్ ఘటన జరిగిన రోజు తెల్లవారుజామున 4:03 గంటల సమయంలో సెమినార్ హాల్‌లోకి వెళ్లడం ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. సెమినార్ హాల్‌లోకి వెళ్లే సమయంలో మెడలో బ్లూటూత్, చేతిలో హెల్మెట్ కూడా ఉంది. 4:32 గంటల సమయంలో సంజయ్ బయటికి వచ్చాడు. ఈ 29 నిమిషాల్లోనే బాధితురాలిపై దారుణంగా అత్యాచారం చేసి చంపేసాడు. ఈ అరగంట సమయంలో ఎవ్వరూ సెమినార్ హాల్ వైపు వెళ్లలేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ సీసీ కెమెరా ఫుటేజ్‌ల ఆధారంగానే సీబీఐ అధికారులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.