టీచ‌ర్ వ‌క్షోజాల గురించి ఇంట్లో విద్యార్థి చ‌ర్చ‌.. ఫిర్యాదు చేసిన త‌ల్లి

student talks about teacher breast at home

Viral News: ఓ టీచ‌ర్ వ‌క్షోజాల గురించి స్కూల్ విద్యార్థి ఇంట్లో చ‌ర్చించడం వివాదాస్ప‌దంగా మారింది. స‌ద‌రు టీచ‌ర్ రెడిట్ యాప్‌లో త‌న‌కు ఎదురైన చేదు అనుభ‌వాన్ని పంచుకున్నారు. ఓ మిడిల్ స్కూల్‌లో ప‌నిచేస్తున్న మ‌హిళ‌.. స్కూల్ నిబంధ‌న‌ల ప్ర‌కారం డ్రెస్ కోడ్ వేసుకుని డ్యూటీకి వెళ్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆమెపై ఓ విద్యార్థి త‌ల్లి ప్రిన్సిప‌ల్‌కి ఫిర్యాదు చేసింద‌ట‌.

ఆ టీచ‌ర్ డ్రెస్ కోడ్ ఫాలో అవ్వ‌కుండా వ‌క్షోజాలు క‌నిపించేలా దుస్తులు వేసుకుంటున్నార‌ని.. పిల్ల‌లు ఇలాంటి వారి వ‌ల్ల పాడైపోతార‌ని ఫిర్యాదు చేసారు. అయితే ఆ ప్రిన్సిప‌ల్ టీచ‌ర్‌కే సపోర్ట్ చేసారు. స్కూల్‌లో పనిచేసే టీచ‌ర్లంతా డ్రెస్ కోడ్ వేసుకుంటార‌ని.. కాక‌పోతే ఫిర్యాదు వ‌చ్చిన టీచ‌ర్‌కు వ‌క్షోజాలు స‌హ‌జంగా ఎక్కువ‌గా ఉండ‌టంతో అంద‌రూ త‌ప్పుగా అర్థంచేసుకుంటున్నార‌ని అన్నారు. దాంతో ఆ విద్యార్థి త‌ల్లి షాకైంది. ఈ విష‌యాన్ని స‌ద‌రు టీచ‌ర్ రెడిట్ యాప్‌లో పోస్ట్ చేయ‌డంతో నెటిజ‌న్లు టీచ‌ర్‌కు మ‌ద్ద‌తు ఇస్తున్నారు.