Infosys vs Cognizant: కార్పొరేట్ యుద్ధం.. ఇన్ఫోసిస్‌పై కాగ్నిజెంట్ కేసు
Infosys vs Cognizant: ఇన్ఫోసిస్ కాగ్నిజంట్ సంస్థల మధ్య కార్పొరేట్ యుద్ధం నెలకొంది. కాగ్నిజెంట్ ఇన్ఫోసిస్‌పై కేసు వేసింది. కాగ్నిజంట్కి చెందిన ట్రైజెట్టో సాఫ్ట్వేర్ సంస్థ.. అమెరికాలోని టెక్సాస్‌లో కోర్టులో ఇన్ఫోసిస్‌పై కేసు వేసింది. ఇన్ఫోసిస్ తమ కంపెనీకి సంబంధించిన ట్రేడ్ రహస్యాలు దోచుకుంటోందని కాగ్నిజంట్ ఆరోపిస్తోంది. కాగ్నిజంట్ ఎంతో గోప్యంగా ఉంచిన డేటాను ఇన్ఫోసిస్ దొంగిలించి ఆ డేటాతో సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ తయారు చేస్తోందని పిటిషన్లో పేర్కొంది. దీనిపై ఇన్ఫోసిస్ స్పందిస్తూ.. అందులో ఎలాంటి వాస్తవం లేదని తమ నిజాయతీని కోర్టులో నిరూపించుకుంటామని వెల్లడించింది.
కాగ్నిజంట్ కొన్ని టాస్క్‌ల పర్పస్ కోసమని తమ కంపెనీకి సంబంధించిన కాన్ఫిడెన్షియల్ సమాచారాన్ని ఇన్ఫోసిస్ చేతిలో పెట్టింది. దీనిని ఇన్ఫోసిస్ అడ్వాంటేజ్‌గా తీసుకుని అవసరానికి మించి ఆ సమాచారాన్ని వినియోగించుకుందని.. ఇందుకు తమ కంపెనీకి నష్టపరిహారం చెల్లించాల్సిందే అని కాగ్నిజంట్ పిటిషన్లో పేర్కొంది. గతంలో సింటెల్ అనే కంపెనీపై కూడా కాగ్నిజంట్ పిటిషన్ వేసి గెలిచింది. సింటెల్ కంపెనీ కాగ్నిజంట్‌కు సంబంధించిన సమాచారాన్ని వినియోగించుకుందని పిటిషన్ వేయగా.. ఆ పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం కాగ్నిజంట్ వైపే నిలబడింది.