Nag Ashwin: ప్రభాస్‌పై కామెంట్ చేసిన వ్యక్తికి కానుకలు పంపుతా
Nag Ashwin: కల్కి 2898 ఏడి సినిమాలో ప్రభాస్ జోకర్‌లా ఉన్నాడని బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి చేసిన కామెంట్‌పై యావత్ టాలీవుడ్ ఆగ్రహ జ్వాలలపై ఉంది. అర్షద్ సారీ చెప్పాల్సిందేనంటూ రెబెల్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అర్షద్‌ను ట్రోల్ చేస్తూనే ఉన్నారు. కానీ అర్షద్ ఇప్పటివరకు సారీ చెప్తున్నట్లు కానీ తనకు ప్రభాస్‌పై ఎలాంటి తప్పుడు ఉద్దేశం లేదని కానీ ఎలాంటి పోస్ట్ పెట్టలేదు.
ఈ నేపథ్యంలో కల్కి దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించారు. ఇప్పుడిప్పుడే భారతీయ చిత్ర పరిశ్రమగా ఎదుగుతున్నామని.. మళ్లీ టాలీవుడ్, బాలీవుడ్, నార్త్, సౌత్ అనే పాత రోజులు తీసుకురావద్దని అన్నారు. అర్షద్ వార్సి కాస్త మెరుగైన పదాలు వాడి ఉండాల్సిందని.. ఏదేమైనప్పటికీ అర్షద్ పిల్లలకు బుజ్జి బొమ్మలు కానుకగా పంపుతానని అన్నారు. కల్కి పార్ట్ 2లో ఇంకా బాగా తీసేందుకు మరింత కృషి చేస్తానని తెలిపారు.