Assam Gang Rape Case: పోలీసుల నుంచి తప్పించుకున్నాడు.. విధి వదిలిపెట్టలేదు
Assam Gang Rape Case: చేసిన పాపాలు, కర్మలు ఊరికే పోవు అంటుంటాం. ఈ ఘటనలో అది నూటికి నూరు శాతం నిజం అని మరోసారి రుజువైంది. అస్సాంలోని ఢింగ్ ప్రాంతంలో వారం రోజుల క్రితం గ్యాంగ్ రేప్ జరిగింది. ఓ మైనర్ బాలిక ట్యూషన్ నుంచి ఇంటికెళ్తుంటే ముగ్గురు వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. స్థానికులు అటుగా వెళ్తూ చూడగా బాలిక అర్థనగ్నంగా స్పృహ లేకుండా పడి ఉంది. దాంతో వెంటనే హాస్పిటల్‌కు తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రధాన నిందితుల్లో ఒకరైన తఫాజుల్ అనే వ్యక్తిని పోలీసులు విచారణ నిమిత్తం నిన్న క్రైం సీన్‌కు తీసుకువెళ్లారు. అదే అదనుగా భావించి తఫాజుల్ పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. పారిపోయి దగ్గర్లోని ఓ కొలనులో దూకేసాడు. పోలీసులు వెళ్లిపోయాక బయటకు వచ్చి పారిపోవాలనుకున్నాడు. కానీ తఫాజుల్ కొలనులో మునిగిపోయి చనిపోయాడు. రాత్రంతా అతని శవం కోసం పోలీసులు గాలించగా ఈరోజు ఉదయం లభ్యమైంది.