Kolkata Rape Case: రాక్షస నిందితుడి తరఫున వాదించనున్న మహిళ
Kolkata Rape Case: పై ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ముఖం చూస్తేనే ఒళ్లు జలదరిస్తుంది. కలకత్తాకు చెందిన వైద్యురాలిని అతి క్రూరంగా అత్యాచారం చేసి చంపేసింది ఇతనే. ఇతని పేరు సంజయ్ రాయ్. పోలీసులు అదుపులో ఉన్న సంజయ్కు ఇంకా సరైన శిక్ష పడలేదు. రోజూ విచారణ చేస్తున్నా కూడా ఓ ఆడపిల్లను దారుణంగా చంపేసానే అనే బాధ కానీ పశ్చాత్తాపం కానీ ఇతనిలో ఏ కొసానా లేదు. ఇలాంటి రాక్షసుడి తరఫున ఎవరు మాత్రం వాదిస్తారు? అందుకే ఏ ఒక్క లాయర్ కూడా ముందుకు రాలేదు.
ఈ నేపథ్యంలో స్థానిక సీల్దా కోర్టు నిందితుడి తరఫున వాదించేందుకు ఏకంగా ఓ మహిళా లాయర్నే ఎపాయింట్ చేయడం షాకింగ్ అంశంగా మారింది. కవితా సర్కార్ అనే 56 ఏళ్ల మహిళ నిందితుడి తరఫున వాదించనున్నారు. ఈ నేపథ్యంలో కవిత మీడియాతో మాట్లాడుతూ.. తనను న్యాయస్థానం ఎంపికచేసిందని.. తానంతట తానే ఈ కేసును వాదించేందుకు ఒప్పుకోలేదని అన్నారు. నిందితుడు ఎంతటి క్రూరమైనవాడైనా అతని విషయంలో కూడా నిజాయతీగా విచారణ జరగాలని.. నిందితుడు దోషి అని తేలే వరకు అతన్ని అమాయకుడిగానే పరిగణించాలని అన్నారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ కాబట్టి ఒకవేళ అతను దోషి అని తేలితే ఉరిశిక్ష కాకుండా జీవిత ఖైదు వేసేలా తాను వాదించనున్నానని వెల్లడించడం కొసమెరుపు. ఓ ఆడపిల్లను దారుణంగా హత్య చేసిన వాడి కోసం మరో ఆడది అతని తరఫున వాదించడం ఏంటో అని బాధితురాలి తల్లిదండ్రులు తలపట్టుకున్నారు.