ప్ర‌భాస్‌పై బాలీవుడ్ న‌టుడి కామెంట్.. ఫిర్యాదు చేసిన‌ మంచు విష్ణు

manchu vishnu writes letter to poonam dhillon against arshad warsi

Manchu Vishnu: రెబెల్ స్టార్‌పై జోక‌ర్ అని కామెంట్ చేసిన బాలీవుడ్ న‌టుడు అర్ష‌ద్ వార్సిపై మా అధ్యక్షుడు మంచు విష్ణు ఫిర్యాదు చేసారు. సైన్టా (CINETAA) అధ్య‌క్షురాలు, బాలీవుడ్ న‌టి పూన‌మ్ ధిల్ల‌న్‌కు మంచు విష్ణు లేఖ రాసారు.

“” పూన‌మ్ ధిల్ల‌న్ గారూ.. సెల‌బ్రిటీలుగా మ‌నం చేసే వ్యాఖ్య‌లకు ఈ సోష‌ల్ మీడియా జ‌మానాలో ప‌దును ఎక్కువ‌. మ‌న నోటి నుంచి వ‌చ్చే మాట మంచి చేస్తుంది.. చెడు కూడా చేస్తుంది. బాలీవుడ్ న‌టుడు అర్ష‌ద్ వార్సి ప్ర‌భాస్‌పై చేసిన వ్యాఖ్య‌లు టాలీవుడ్ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో వివాదాస్ప‌దంగా మారింది. ఇక ముందు ఆయ‌న ఇత‌ర న‌టీన‌టుల‌పై ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌కుండా మీరే బాధ్య‌త తీసుకోవాలి. ఈ విష‌యంలో మీరు సైన్టా అధ్యక్షురాలిగా బాధ్య‌త తీసుకుని ఇలాంటి ఘ‌ట‌న‌లు ముందు ముందు జ‌ర‌గ‌కుండా చూస్తార‌ని ఆశిస్తున్నారు. మ‌న‌దంతా ఒకే కుటుంబం. సంతోషంగా ప్ర‌శాంతంగా జీవిద్దాం “” అని పేర్కొన్నారు.

క‌ల్కి సినిమాలో ప్ర‌భాస్ లుక్ జోక‌ర్‌లా ఉంద‌ని అర్ష‌ద్ వార్సి అన‌డంతో దుమారానికి దారితీసింది. ఇప్ప‌టికే ఆయ‌న‌పై టాలీవుడ్‌కి చెందిన చాలా మంది ప్ర‌ముఖులు మండిప‌డ్డారు.