Kolkata Rape Case: అమ్మాయి చ‌నిపోతే నీకు న‌వ్వొస్తోందా? జ‌డ్జి చివాట్లు

supreme court judge slams kapil sibal for laughing during hearing

Kolkata Rape Case: క‌ల‌క‌త్తా అత్యాచార ఘ‌ట‌న‌లో వెస్ట్ బెంగాల్ ప్ర‌భుత్వం త‌ర‌ఫు వాదిస్తున్న ప్ర‌ముఖ లాయ‌ర్ క‌పిల్ సిబాల్‌పై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఓ ప‌క్క సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా సీబీఐ త‌ర‌ఫు వాదిస్తూ క‌ల‌క‌త్తా పోలీసులు కేసు న‌మోదు చేయ‌డంలో జాప్యం చేసార‌ని విచార‌ణ‌లో లోటుపాట్లు ఉన్నాయ‌ని అన్నారు. దీనికి క‌పిల్ సిబాల్ స‌మాధానం ఇవ్వాల్సిన స‌మ‌యంలో న‌వ్వారు. దాంతో తుషార్ మెహ‌తాతో పాటు సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తులు కూడా మండిప‌డ్డారు. ఓ యువ‌తి ప్రాణాలు కోల్పోయింది. ఈ స‌మ‌యంలో న‌వ్వాల్సిన అవ‌స‌రం ఉందా అని చివాట్లు పెట్టారు. ఆ త‌ర్వాత సిబాల్ సారీ చెప్తూ త‌న వాద‌న‌లు వినిపించ‌గా.. క‌ల‌క‌త్తా పోలీసులకు స‌మ‌న్లు జారీ చేస్తూ త‌దుప‌రి విచార‌ణ‌ను సెప్టెంబ‌ర్ 5కి వాయిదా వేస్తారు.