Supreme Court: మహిళా లాయర్‌పై దాడి చేసిన కోతి
Supreme Court: సుప్రీంకోర్టులో ఈ రోజు ఓ లాయర్‌కి చేదు అనుభవం ఎదురైంది. కోర్టు లోపలికి లాయర్ వెళ్తున్న సమయంలో ఓ కోతి ఉన్నట్టుండి ఆయనపై ఎటాక్ చేసింది. లాయర్ సెల్వకుమారి కోర్టు లోపలికి వెళ్తుండగా కొన్ని కోతులు ఆమెపై దాడి చేసాయి. దాంతో ఆమె తొడకు గాట్లు పడ్డాయి. దాంతో వెంటనే సిబ్బంది కోతులను తరిమికొట్టారు. ఆమెకు ప్రథమ చికిత్స అందించేందుకు డిస్పెన్సరీకి తీసుకెళ్లగా.. అక్కడ నిర్మాణ కార్యక్రమాలు జరుగుతుండడంతో ఆమెకు వైద్య సపర్యలు అందకపోవడం గమనార్హం. ఆ తర్వాత ఆమెను దగ్గర్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లగా వైద్యులు గాయాన్ని శుభ్రం చేసి టీటీ ఇంజెక్షన్ ఇచ్చారట.