Pawan Kalyan: ప‌వ‌న్ నుంచి అరుదైన స‌ర్‌ప్రైజ్

Pawan Kalyan: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స‌ర్‌ప్రైజింగ్ ఫోటో పోస్ట్ చేసారు. ప‌వ‌న్ ఇన్‌స్టాగ్రామ్‌ను త‌న అధికారిక ప‌నుల నిమిత్తం వాడుతుంటారు. అలాంటిది ఈరోజు ఒక అరుదైన ఫోటో పోస్ట్ చేసారు. త‌న సోద‌రితో చిన్న‌ప్పుడు క‌లిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. నా సోద‌రితో ఈ జ్ఞాప‌కం జీవితాంతం గుర్తుండిపోతుంది. మేమిద్దం బెంగాల్ టైగ‌ర్ బొమ్మ‌ల‌తో క‌లిసి పోజులిచ్చాం అని క్యాప్ష‌న్ ఇచ్చారు. అయితే రాఖీ రోజున కూడా పోస్ట్ చేయ‌ని ప‌వ‌న్.. ఇప్పుడు స‌డెన్‌గా ఈ ఫోటో ఎందుకు పెట్టారో..!