Kolkata Rape Case: జరిగింది.. విచారణలో మోసం జరిగింది
Kolkata Rape Case: కలకత్తా హత్యాచార ఘటన విచారణలో మోసం జరిగిందని CBI రిపోర్టు వెల్లడించింది. ఆగస్ట్ 9న కలకత్తాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్‌లో ట్రైనీ వైద్యురాలు హత్యాచారానికి గురైంది. అయితే.. ఆమెను దారుణంగా రేప్ చేసి చంపేస్తే.. అది సూసైడ్ అని విద్యార్థిని తల్లిదండ్రులకు తప్పుడు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఎటూ ఈ కేసును సరిగ్గా విచారించలేరని భావించిన రాష్ట్ర ప్రభుత్వం కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్‌వెస్టిగేషన్ (CBI)కు అప్పగించింది.
ఆగస్ట్ 9న అసలేం జరిగింది అనే విషయం నుంచి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టిన CBI.. కేసు మొత్తాన్ని తప్పుదోవ పట్టించినట్లు వెల్లడించారు. క్రైం జరిగిన ప్రదేశంలో మార్పులు జరిగాయని.. విద్యార్థిని తల్లిదండ్రులకు తప్పుడు సమాచారం అందించారని అన్నారు. హత్యాచారం జరిగిందని తెలిసిన మరుక్షణం పోలీసులు FIR నమోదు చేయకుండా.. మృతదేహానికి అంత్యక్రియలు చేయించిన తర్వాత FIR నమోదు చేసారు. ఎప్పుడైతే పోలీసులు విచారణ చేయడం మొదలుపెట్టారో అప్పటికే క్రైం సీన్ ట్యాంపరింగ్‌కు గురైంది.
ప్రధాన నిందితుడైన సంజయ్ రాయ్‌ను కలకత్తా పోలీసులు అరెస్ట్ చేసినప్పటికీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా లై డిటెక్టర్ టెస్ట్ చేయలేదు. DNA, ఫోరెన్సిక్ ఆధారాలను బట్టే సంజయ్ రాయ్ సమాధానాలు ఉన్నాయట. ఆ తర్వాత హాస్పిటల్ అధికార యంత్రాంగం కాలేజ్ ప్రిన్సిపల్‌గా పనిచేసిన డాక్టర్ సందీప్ ఘోష్ అనే వ్యక్తిపై అనుమానాలు ఉన్నప్పుడు అతన్ని సరిగ్గా విచారించలేదు. ఏదో నామమాత్రంగా అతన్ని విధుల నుంచి సస్పెండ్ చేసారు. ఆ తర్వాత వెంటనే మళ్లీ ప్రిన్సిపల్‌గా నియమించడంతో కలకత్తాలో పెద్ద ఎత్తున ధర్నాలు చోటుచేసుకున్నాయి. దాంతో మళ్లీ సందీప్ ఘోష్‌ను తప్పించి సీబీఐ అదుపులోకి తీసుకుని విచారించింది. అప్పుడు కూడా ఆయన తలాతోకా లేని సమాధానాలు చెప్పాడు. ఇంకా విచారణ జరగాల్సి ఉంది.