Jagan: రిచెస్ట్ సీఎంలలో జగనే టాప్‌!

Delhi : దేశంలో  ఉన్న ముఖ్యమంత్రుల్లో అత్యంత సంప‌న్నులు(richest cm’s in the country) ఎవరూ అని ఓ సంస్థ సర్వే చేయగా.. అందులో ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి(ys jagan) టాప్‌ పొజిషన్‌(top place) దక్కించుకున్నారు. అంతేకాదు.. దేశంలో ఉన్న 30 మంది ముఖ్యమంత్రులతో దాదాపు 29 మంది సంపన్నులేనని ఆ సంస్థ చెబుతోంది. ప్రస్తుతం ఏపీ​ సీఎం ​​ జగన్​ మోహన్​ రెడ్డి 510 కోట్లు విలువైన ఆస్తులతో అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ఇక లిస్టులో బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ(దీదీ)(west bengal cm mamata banerjee) నిలవడం గమనార్హం. ఆమె పేరిట కేవలం 15 లక్షలే ఉన్నాయట. ఈ విషయాలను అసోసియేషన్​ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్​(association for democratic reforms)- ఏడీఆర్(adr), నేషనల్ ఎలక్షన్‌ వాచ్ ​(new) అనే సంస్థలు కొంత వివరాలు సేకరించి ఈ మేరకు నివేదికలను విడుదల చేశాయి. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు.. ఎన్నికల సమయంలో ఇచ్చిన అఫిడవిట్​లను విశ్లేషించి ఈ నివేదిక రూపొందించినట్లు చెబుతున్నాయి.

దేశంలోని ​28 రాష్ట్రాల సీఎంలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలైన ఢిల్లీ, పుదుచ్చేరి సీఎంల ఆస్తులను వారు విశ్లేషించారు. ఒక్కో సీఎం సగటు ఆస్తి రూ.33.96 కోట్లు వరకు ఉందని వారు పేర్కొన్నారు. అందులో ఏపీ సీఎం జగన్‌ రూ.510కోట్లు, అరుణాచల్ ​ సీఎం ఖండూ రూ.163 కోట్లు, ఒడిశా నవీన్​ పట్నాయక్ రూ.63 కోట్లు.. అత్యంత ఆస్తి కలిగిన ముగ్గురు సీఎంలుగా ఉన్నారు. బెంగాల్‌ సీఎం మమతా రూ.15 లక్షలు, కేరళ సీఎం పినరయి  కోటి రూపాయలు, హరియాణా సీఎం మనోహర్​ లాల్ ఖట్టర్​ రూ.కోటి పైన.. ఆస్తులు కలిగి.. అతి తక్కువ ఆస్తి కలిగిన సీఎంలుగా నిలిచారు. ఇక తెలంగాణ సీఎం చంద్రశేఖర రావు ఆస్తి విలువ రూ.23.55కోట్లు ఉందని తెలిపారు. దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆస్తి రూ.3 కోట్లకుపైగా ఉందన్నారు.