మెయింటైనెన్స్ కింద నెలకు 6 లక్షలు ఇవ్వాలన్న భార్య.. షాకింగ్ తీర్పు ఇచ్చిన జడ్జ్
Viral News: సాధారణంగా భార్యాభర్తలు విడిపోవాలనుకున్నప్పుడు కోర్టు భార్యకు భర్త మెయింటైనెన్స్ ఇవ్వాలనో లేదా భరణం ఇవ్వాలనో తీర్పు ఇస్తుంటుంది. ఇలా కొన్ని కేసుల్లో మాత్రమే జరుగుతుంటుంది. అయితే.. భర్త సంపాదనను బట్టే భార్యకు రావాల్సిన మెయింటైనెన్స్ ఆధారపడి ఉంటుంది. అయితే ఓ మహిళ తనకు మెయింటైనెన్స్ కింద నెలకు ఏకంగా అక్షరాలా 6 లక్షల 16 వేల రూపాయలు కావాలని డిమాండ్ చేసింది. అది విన్న మహిళా జడ్జ్ షాకైంది. దాంతో కాసేపు ఆమె కేసును పరిశీలించి షాకింగ్ తీర్పు ఇచ్చింది.
ఇంతకీ తీర్పు ఏమని ఇచ్చిందంటే.. ఆ మహిళ నెలకు రూ.6,16,000 ఖర్చు చేస్తుందంటే.. అదేదో ఆమే సంపాదించుకుంటుంది ఇక భరణం, మెయింటైనెన్స్ అవసరం లేదు అని వెల్లడించింది. దాంతో భార్య షాకైంది. భర్త మాత్రం సంతోషంతో జడ్జి తీర్పుకి దండం పెట్టాడు. ఈ ఘటన ఎక్కడ చోటుచేసుకుందో తెలీడంలేదు కానీ.. ఓ కోర్టు హియరింగ్ వీడియో ట్విటర్లో వైరల్ అవుతోంది.