భారతీయ వైద్యుడి నిర్వాకం.. స్పృహలో లేని పేషెంట్లతో సెక్స్ చేస్తూ..
Viral News: అమెరికాలో ఓ భారతీయ వైద్యుడు అరెస్ట్ అయ్యాడు. మిచిగన్‌లో వైద్యుడిగా పనిచేస్తున్న ఉమైర్ ఏజాజ్ హాస్పిటల్‌లోని బాత్రూమ్లు, డ్రెస్సింగ్ రూంలలో హిడెన్ కెమెరాలు పెట్టాడు. ఈ కెమెరాలను తన ఇంట్లో కూడా పెట్టించుకున్నాడు. ఓసారి ఏజాజ్ భార్య అతని ఫోన్ చెక్ చేస్తుండగా ఆడవాళ్లు, చిన్న పిల్లలకు సంబంధించిన నగ్న వీడియోలు కనిపించాయి.
వెంటనే ఆమె పోలీసులకు సమాచారం అందించింది. దాంతో వెంటనే స్పందించిన పోలీసులు ఏజాజ్ను అదుపులోకి తీసుకున్నారు. అతని ఫోన్, ల్యాప్‌టాప్ చెక్ చేయగా ఒకే ఫోల్డర్లో ఏకంగా 13000 నగ్న వీడియోలు లభ్యం అయ్యాయి. అందులో చిన్న పిల్లల దగ్గర్నుంచి ముసలి వాళ్ల వరకు అన్ని వీడియోలు లభ్యమయ్యాయి. అంతేకాదు.. హాస్పిటల్లో స్పృహలో లేని పేషెంట్లతో సెక్స్ చేస్తూ కూడా ఫోన్లో రికార్డింగ్ చేసి పెట్టుకున్నాడట. అయితే ఈ కేసుకు సంబంధించిన విచారణ చేపట్టాలంటే కొన్ని నెలలు పడుతుందని పోలీసులు తెలిపారు.