Rishab Shetty: బాలీవుడ్‌పై రిష‌భ్ షాకింగ్ కామెంట్స్

Rishab Shetty accuses bollywood for potraying india in bad light

Rishab Shetty: ప్ర‌ముఖ కన్న‌డ న‌టుడు రిష‌భ్ శెట్టి బాలీవుడ్ చిత్ర ప‌రిశ్ర‌మ‌పై షాకింగ్ కామెంట్స్ చేసారు. ఎన్నో ఏళ్లుగా బాలీవుడ్ మ‌న దేశాన్ని త‌ప్పుగా చూపిస్తోంద‌ని అన్నారు. లాఫింగ్ బుద్ధా అనే క‌న్నడ సినిమాను ప్రమోట్ చేస్తున్న రిష‌భ్ బాలీవుడ్‌పై మండిప‌డ్డారు. గ్లోబ‌ల్ స్టేజ్‌పైకి వెళ్లి మ‌రీ మ‌న భార‌తీయ సినిమాల‌ను త‌ప్పుగా చుల‌క‌న‌గా చేసి చూపిస్తుంటార‌ని.. అది మారాల‌ని అన్నారు. క‌న్న‌డ‌లోనే కాకుండా భార‌త‌దేశ వ్యాప్తంగా బ్లాక్ బ‌స్ట‌ర్ విజయం సాధించిన కాంతార సినిమాకు గానూ రిష‌భ్ పేరును జాతీయ అవార్డుకు నామినేట్ చేసారు. ప్ర‌స్తుతం రిష‌భ్ కాంతార 2 సినిమాతో బిజీగా ఉన్నారు.