Harish Shankar: మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌కి ఆ వెబ్‌సైట్ రాసిన రివ్యూ న‌చ్చింది

harish shankar says he liked great andhra review on mr bachchan

Harish Shankar: హరీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ (MR bachchan) యావ‌రేజ్ హిట్ అందుకుంది. ర‌వితేజ‌ (Ravi Teja), భాగ్య‌శ్రీ బోర్సే  (Bhagyashree Borse) క‌లిసి న‌టించిన ఈ సినిమాపై పాజిటివ్ రివ్యూల కంటే ట్రోల్స్ ఎక్కువ‌గా వ‌చ్చాయి. అయితే.. మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌పై చాలా వెబ్‌సైట్లు, యూట్యూబ‌ర్లు చాలా రివ్యూలు ఇచ్చారు. అన్ని రివ్యూల‌లో మీకు ఎవ‌రి రివ్యూ న‌చ్చింది అని హ‌రీష్ శంక‌ర్‌ను అడ‌గ్గా.. ఎన్ని వ్య‌క్తిగ‌త కార‌ణాలు ఉన్నా గ్రేట్ ఆంధ్ర వారు రాసిన రివ్యూ న‌చ్చింద‌ని హ‌రీష్ శంక‌ర్ అన్నారు.

గ్రేట్ ఆంధ్ర‌లో సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్‌గా ప‌నిచేస్తున్న మూర్తికి హ‌రీష్ శంక‌ర్‌కి ఎప్ప‌టి నుంచో విభేదాలు ఉన్నాయి. ఓసారి హ‌రీష్ శంక‌ర్ మూర్తిని ప‌రోక్షంగా గుంట న‌క్క అంటూ కామెంట్ చేసారు. ఆ త‌ర్వాత వీరిద్ద‌రి మ‌ధ్య ట్విట‌ర్‌లో ట్వీట్ల యుద్ధం కూడా జ‌రిగింది. ఇక సినిమా ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా మూర్తికి హ‌రీష్ శంక‌ర్ ఇంట‌ర్వ్యూ కూడా ఇచ్చారు.