Sajal Ali: ప్ర‌భాస్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఎవ‌రీ పాకిస్థానీ భామ‌?

all you need to know about sajal ali who is going to star in prabhas movie

Sajal Ali: హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో రెబెల్ స్టార్ ప్ర‌భాస్ ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. మొన్నే పూజా కార్య‌క్ర‌మాన్ని కూడా నిర్వ‌హించారు. అందులో ఇన్‌స్టాగ్రామ్ స్టార్ ఇమాన్ ఇస్మాయిల్‌ను హీరోయిన్‌గా ఎంపిక‌చేసారు. అయితే ప్ర‌భాస్ సినిమాలో మ‌రో న‌టికి కూడా అవ‌కాశం ద‌క్కింది. ఆమే స‌జ‌ల్ అలీ. పాకిస్థానీ అయిన ఈ భామ ప్ర‌భాస్ సినిమాలో ఛాన్స్ ద‌క్కించుకుంది.

స‌జ‌ల్ అలీ భార‌త్‌లో అంత‌గా గుర్తింపు పొంద‌లేదు కానీ పాకిస్థాన్‌లో టాప్ న‌టి. అత్య‌ధిక పారితోషికం తీసుకుంటున్న న‌టి కూడా ఆమేన‌ట‌. టీవీ సీరియ‌ళ్ల‌లో న‌టిస్తూ 2017లో వ‌చ్చిన మామ్ సినిమాలో తొలి అవకాశం ద‌క్కించుకుంది. ఇందులో స‌జ‌ల్ అల‌నాటి తార శ్రీదేవి కూతురిగా న‌టించి త‌న న‌ట‌న‌కు మంచి ప్రశంస‌లు ద‌క్కించుకున్నారు. దాదాపు ఏడేళ్లుగా స‌జ‌ల్ అలీ ఎలాంటి సినిమాల్లోనూ క‌నిపించ‌లేదు. ఇప్పుడు ప్ర‌భాస్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు. 2020లో అహ‌ద్ ర‌జా మీర్ అనే వ్య‌క్తిని పెళ్లి చేసుకున్నారు. 2022లో అత‌నికి విడాకులు ఇచ్చేసారు.