Joint Home Loan: భార్య‌తో క‌లిసి లోన్.. ఎంత లాభ‌మో తెలుసా?

all you need to know about taking Joint Home Loan with wife

Joint Home Loan: మీరు ఇంటి లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారు. ఒక‌వేళ మీకు వివాహ‌మైన‌ట్లైతే.. మీ భార్య‌తో క‌లిసి జాయింట్ లోన్ తీసుకోండి. ఈ జాయింట్ లోన్ వ‌ల్ల క‌లిగే లాభాలు అన్నీ ఇన్నీ కావు.

లోన్ తీసుకునే స‌మ‌యంలో మీ భార్య కో అప్లికంట్ అయితే త‌క్కువ వ‌డ్డీ రేటుకే లోన్ వ‌స్తుంది. అప్పుడు మీరు తీసుకునే లోన్‌పై ఉన్న వ‌డ్డీ రేటుకి 0.05% వ‌డ్డీ త‌గ్గించి ఇస్తారు.

దీని వ‌ల్ల మీకు EMIపై అంత‌గా భారం ప‌డ‌దు. ఇక ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. దాదాపు 7 ల‌క్ష‌ల వ‌ర‌కు మీరు ట్యాక్స్ బెనిఫిట్ పొంద‌చ్చు.

ఒక్కొక్క‌రు సెక్ష‌న్ 80C కింద తీసుకున్న మొత్తం లోన్‌పై రూ.3 ల‌క్షల వ‌ర‌కు, సెక్ష‌న్ 24 కింద రూ.2 ల‌క్ష‌ల వ‌ర‌కు ట్యాక్స్ ఆదా చేసుకోవ‌చ్చు.

మీకు త‌క్కువ ఆదాయం, క్రికెట్ స్కోర్ ఉన్న‌ప్ప‌టికి కూడా మీ భార్య కో అప్లికంట్ అయితే లోన్ సులువుగా వ‌స్తుంది. ఎందుకంటే బ్యాంకులు మీ ఇద్ద‌రి ఆదాయాలు, క్రిడిట్ స్కోర్ చూసి లోన్ మొత్తం అప్రూవ్ చేస్తారు.

ఇద్ద‌రూ క‌లిపి తీసుకుంటున్నారు కాబ‌ట్టి లోన్ లిమిట్ కూడా పెరుగుతుంది. అంటే మీకు ఒక్క‌రికే రూ.20 ల‌క్ష‌ల వ‌ర‌కు లోన్ ఇస్తున్నార‌నుకోండి.. మీ భార్యతో క‌లిపి రూ.30 నుంచి రూ.40 ల‌క్ష‌ల వ‌ర‌కు లోన్ ఇచ్చే స‌దుపాయం ఉంటుంది.

త‌క్కువ వ‌డ్డీ రేటుకే లోన్ రావాలంటే మీరు తీసుకునే ప్రాప‌ర్టీ మీ భార్య పేరిట ఉండి తీరాల‌న్న ఒక్క నియ‌మాన్ని గుర్తుపెట్టుకోండి.