Narendra Modi: 10 గంటల పాటు రైలులో ప్రయాణించనున్న మోదీ
Narendra Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒకటి కాదు రెండు కాదు దాదాపు పది గంటల పాటు రైలులో ప్రయాణించనున్నారు. ఆగస్ట్ 23న మోదీ ఉక్రెయిన్‌లో పర్యటించనున్నారు. అయితే ఉక్రెయిన్‌కు ప్రత్యేక విమానంలో కాకుండా ఆయన రైలులో ప్రయాణించనున్నారట. ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేస్తున్నప్పటి నుంచి ఇప్పటివరకు ఏ భారత నేత కూడా ఉక్రెయిన్‌లో పర్యటించలేదు. అలా పర్యటించబోతున్న తొలి భారతీయ నేత మోదీనే.
దాదాపు ఏడు గంటల పాటు కీవ్ అనే ప్రాంతంలో గడపనున్న మోదీ.. అక్కడికి రైల్ ఫోర్స్ వన్ అనే రైలులో ప్రయాణించనున్నారు. గతంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రోన్‌లు కూడా ఇదే రైలులో ప్రయాణించారు. ఉక్రెయిన్ ఎలక్ట్రానిక్ ఇన్‌ఫ్రా దెబ్బతినడంతో మోదీ పోలాండ్ నుంచి కీవ్‌కు రైలులో 10 గంటల పాటు ప్రయాణించాల్సి ఉంటుంది. మోదీ ఇప్పిటివరకు ప్రత్యేక విమానాల్లో ఇతర దేశాలకు ప్రయాణించారే తప్ప ఇలా రైలులో ఆయన 10 గంటల పాటు ప్రయాణించబోతుండడం ఇదే తొలిసారి. దాంతో ఉక్రెయిన్ ప్రభుత్వం భారీగా భద్రతా ఏర్పాట్లు చేస్తోంది.