CAS: వినేష్ ఫోగాట్‌ను అంత కఠినంగా శిక్షించకుండా ఉండాల్సింది
CAS: భారత రెజ్లర్ వినేష్ ఫోగాట్ విషయంలో అంత కఠినంగా వ్యవహరించకుండా ఉండాల్సిందని CAS వెల్లడించింది. 50 కేజీల రెజ్లింగ్ రౌండ్లో సెమీ ఫైనల్స్ వరకు చేరి చరిత్ర సృష్టించిన వినేష్ ఫైనల్స్‌లో బంగారు పతకాన్ని తెస్తుందని అంతా ఆశించారు. కానీ కేవలం 100 గ్రాములు అధిక బరువు ఉండడంతో ఆమెను ఫైనల్స్ నుంచి డిస్క్వాలిఫై చేసారు.
అయితే.. కనీసం సెమీ ఫైనల్స్ వరకైనా సరైన బరువులో ఉంది కాబట్టి.. సెమీ ఫైనల్స్‌లో గెలిచింది కాబట్టి కనీసం రజత పతకం అయినా ఇవ్వాలని CASను కోరారు. ఇందుకు CAS ఒప్పుకోలేదు. రూల్స్ ఎవరికైనా రూల్సే అని ఒక అథ్లెట్‌గా బరువు నియంత్రణలో ఉంచుకోవాల్సిన బాధ్యత ఆమెకు లేదా అని మండిపడింది. దాంతో వినేష్ బాధాతప్త హృదయంతో భారత్‌కు తిరిగొచ్చేసింది. అయితే.. తమ నిర్ణయం గురించి CAS వెల్లడిస్తూ.. వినేష్‌ను కేవలం ఫైనల్ రౌండ్ నుంచి తప్పించకుండా.. మొత్తం కాంపిటీషన్ నుంచి తప్పించడం మరీ దారుణం అని వెల్లడించింది. వినేష్ డిస్క్వాలిఫై అవడంతో ఆ బంగారు పతకం కాస్తా అమెరికన్ రెజ్లర్ సారా ఆన్‌కు దక్కింది.