Harish Shankar: ఆ విష‌యంలో ర‌వితేజ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఒక్క‌టే

harish shankar reveals ravi teja reaction on mr bachchan

Harish Shankar:  హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ సినిమాకు మిక్స్‌డ్ రివ్యూలు వ‌చ్చాయి. నిజానికి ఇదో ఫ్లాప్ సినిమా అని చాలా మంది అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ విష‌యంపై ర‌వితేజ హ‌రీష్ శంక‌ర్‌తో ఓ మాట‌న్నార‌ట‌. ఏంట్రా అబ్బాయ్. డివైడెడ్ టాక్ వ‌స్తోంది. జాగ్ర‌త్త‌గా చూసుకో. ఆల్ ది బెస్ట్ అన్నార‌ట‌. ఈ సంద‌ర్భంగా గ‌తంలో గ‌బ్బ‌ర్ సింగ్ తీసిన‌ప్పుడు కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న‌తో చెప్పిన ఓ మాట‌ను హ‌రీష్ శంక‌ర్ ఆడియ‌న్స్‌తో షేర్ చేసుకున్నారు. త‌ర్వాతి సినిమా బాగా చూసుకో అని ప‌వ‌న్ అన్నార‌ట‌. ర‌వితేజ, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌లు సినిమా క‌లెక్షన్స్ గురించి ఏ రోజూ అడ‌గ‌లేద‌ని ఇద్దరు సక్సెస్ ఫెయిల్యూర్లని ఒకేలా చూస్తారని వెల్ల‌డించారు.