“క‌ల్కిలో ప్ర‌భాస్ జోక‌ర్‌లా ఉన్నాడు”

Arshad Warsi calls prabhas a joker

Arshad Warsi: యంగ్ రెబెల్ స్టార్ ప్ర‌భాస్‌ను ప‌ట్టుకుని బాలీవుడ్ న‌టుడు అర్ష‌ద్ వార్సి షాకింగ్ కామెంట్ చేసాడు. క‌ల్కి 2898 ఏడి సినిమాలో అశ్వ‌త్థామ పాత్ర‌లో అమితాబ్ బ‌చ్చ‌న్ ఇర‌గ‌దీసార‌ని.. కానీ ఆయ‌న ముందు ప్ర‌భాస్ లుక్ మాత్రం జోక‌ర్‌లా కనిపించాడ‌ని అన్నాడు. సినిమాలో హీరో లుక్ విష‌యంలో దర్శ‌కులు ఎందుకు ప్ర‌త్యేక దృష్టి పెట్ట‌రు అని ప్ర‌శ్నించాడు. క‌ల్కి సినిమాలో ప్రభాస్ పాత్ర‌కు ఆయ‌న హాలీవుడ్ న‌టుడు మెల్ గిబ్స‌న్‌లా ఉండాలని అలా కాకుండా ఆయ‌న్ను జోక‌ర్‌లా చూపించార‌ని అన్నాడు. ఇక అర్ష‌ద్ వార్సిని మ‌న రెబెల్ ఫ్యాన్స్ ఏ రేంజ్‌లో సోష‌ల్ మీడియాలో ఉతికి ఆరేస్తారో మ‌న‌కు తెలిసిందే..!