Padi Kaushik Reddy: మూసీ కంటే గబ్బు వాసన రేవంత్ నోట్లో నుంచి వస్తోంది
Padi Kaushik Reddy: హైదరాబాద్‌లో ఉన్న మూసీ నది కంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోరు కంపు కొడుతోందని అన్నారు భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. రేవంత్ నోరు తెరిస్తే అన్ని దేవుళ్ల మీద ఒట్లు వేస్తుంటారని.. ఇలా దేవుళ్లను కూడా మోసం చేసే ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి అని విమర్శించారు. కోట్లు ఖర్చు పెట్టి మూసీ నదిని ప్రక్షాళన చేసే ముందు ఆ నోటిని ప్రక్షాళన చేసుకోవాలని అన్నారు. తిట్టాలంటే తమకు కూడా ఎక్కువ బూతులు వచ్చని కానీ ముఖ్యమంత్రి కుర్చీకి గౌరవిస్తున్నామే తప్ప రేవంత్‌కి కాదని మండిపడ్డారు.