Arun Yogiraj: రామ్ ల‌ల్లా విగ్ర‌హ త‌యారీదారుడికి వీసా ఇవ్వ‌ని అమెరికా

usa denies visa to arun yogiraj

Arun Yogiraj: అయోధ్య రామ‌మందిరంలోని రాముడి విగ్ర‌హాన్ని త‌యారుచేసిన ప్ర‌ముఖ క‌ళాకారుడు అరుణ్ యోగిరాజ్‌కు చేదు అనుభ‌వం ఎదురైంది. ఆయ‌న‌కు వీసా ఇచ్చేందుకు అమెరికా ప్ర‌భుత్వం నిరాక‌రించింది. అమెరికాలో జ‌ర‌గ‌నున్న ఏకేకేఏ వ‌ర‌ల్డ్ క‌న్న‌డ కాన్ఫ‌రెన్స్‌లో యోగిరాజ్ పాల్గొనాల్సి ఉంది.

దీని కోసం ఆయ‌న అమెరికా వెళ్లేందుకు వీసాకు ద‌ర‌ఖాస్తు చేసుకోగా.. అమెరికా నిరాక‌రించింది. పేప‌ర్‌వ‌ర్క్ అంతా స‌రిగ్గా చేసిన త‌ర్వాత కూడా వీసా ఇవ్వ‌లేద‌ని ఆయ‌న కుటుంబం ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ప్ర‌తి రెండేళ్ల‌కోసారి అమెరికాలో ఏకేకేఏ వ‌ర‌ల్డ్ క‌న్న‌డ కాన్ఫ‌రెన్స్ జరుగుతుంది. ఉత్త‌ర అమెరికాతో పాటు ప్ర‌పంచంలోని ఇత‌ర దేశాల్లో నివ‌సిస్తున్న క‌న్న‌డ స్పీక‌ర్ల‌ను పిలిపించి ఈ కాన్ఫ‌రెన్స్‌లో మాట్లాడిస్తారు. అలా యోగిరాజ్‌కు కూడా ఆహ్వానం అందింది. అలాంటిది యోగిరాజ్ వీసాను అమెరికా ర‌ద్దు చేసింది.