Nirmala Sitharaman: అస‌లు పన్ను వ‌సూలే వ‌ద్ద‌నుకున్నా కానీ..

nirmala sitharaman reveals indias difficulties if tax is not collected

Nirmala Sitharaman: భార‌త‌దేశంలోని మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబాల నుంచి ప‌న్ను వ‌సూలు చేయ‌కూడ‌దు అనే ఆలోచ‌న ఉంది కానీ భార‌త్‌కు ప‌రిశోధ‌న అభివృద్ధి విష‌యాన్ని ఆలోచించి వెన‌క్కి త‌గ్గుతున్నాన‌ని అన్నారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్. 1961 ఇన్‌కం ట్యాక్స్ విష‌యంలో కేంద్ర ప్రభుత్వం స‌మీక్ష‌లు చేస్తోంది. మ‌రో ఆరు నెల‌ల్లో ఈ స‌మీక్ష‌కు సంబంధించిన నివేదిక‌ను రిలీజ్ చేస్తారు. మొన్న ప్ర‌వేశ‌పెట్టిన బడ్జెట్‌లో కొత్త ట్యాక్స్ శ్లాబులో స్వ‌ల్ప మార్పులు చేసారు.

రూ.3 ల‌క్ష‌ల వ‌ర‌కు ఆదాయం ఉంటే ప‌న్ను క‌ట్టాల్సిన ప‌ని లేదు

రూ.3 నుంచి రూ.7 ల‌క్ష‌ల వ‌ర‌కు ఆదాయం ఉంటే 5% ప‌న్ను క‌ట్టాలి

రూ.10 నుంచి రూ.12 ల‌క్ష‌ల వ‌ర‌కు ఆదాయం ఉంటే 12% ప‌న్ను క‌ట్టాలి

రూ.12 నుంచి రూ.15 ల‌క్ష‌ల వ‌ర‌కు ఆదాయం ఉంటే 15% ప‌న్ను క‌ట్టాలి

రూ.15 ల‌క్ష‌ల‌కు పైగా ఉంటే 30% వ‌ర‌కు ప‌న్ను క‌ట్టాలి.

కొత్త ప‌న్ను శ్లాబును అంద‌రూ వినియోగించుకునేందుకు స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్‌ను రూ.50,000 నుంచి రూ.75,000 వ‌ర‌కు పెంచారు.