6 తర్వాత పనిచేయని CEO.. ఉద్యోగం నుంచి తీసేసిన కంపెనీ
Starbucks: ఓ కంపెనీ సీఈఓ సాయంత్రం 6 తర్వాత పనిచేయడం లేదని అతన్ని కంపెనీ ఉద్యోగం నుంచి తొలగించింది. ఈ ఘటన ప్రముఖ కాఫీ బేవరేజస్ కంపెనీ స్టార్‌బక్స్‌లో చోటుచేసుకుంది. స్టార్‌బక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా భారత సంతతికి చెందిన లక్ష్మణ్ నరసింహన్ పనిచేసేవారు. అయితే ఆయన ఇటీవల ఉద్యోగంలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది చాలా అవసరమని.. తాను దీనిని ఫాలో అవుతూ ఉంటానని తెలిపారు. తన జీవితంలో ఇప్పటివరకు సాయంత్రం 6 తర్వాత కంపెనీ కోసం పనిచేయలేదని అన్నారు. ఆ ఒక్క మాటతో ఆయన్ను స్టార్‌బక్స్ ఉద్యోగం నుంచి తీసేసింది. లక్ష్మణ్ స్థానంలో బ్రయాన్ నిక్కోల్ అనే వ్యక్తిని నియమించింది.