Darshan: జైల్లో దర్శన్‌కు అస్వస్థత
Darshan: కర్ణాటకకు చెందిన రేణుకా స్వామి అనే వ్యక్తి హత్య కేసులో అరెస్ట్ అయిన నటుడు దర్శన్ తూగుదీప జైల్లో కళ్లు తిరిగిపడిపోయాటడట. విచారణ సమయంలో దర్శన్ శరీరంలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం బెంగళూరులోని జైల్లో శిక్ష పొందుతున్న దర్శన్ చాలా కిలోల వరకు బరువు తగ్గిపోయారట. జైలు ఆహారం పడక ఇంటి నుంచి భోజనం కోసం దరఖాస్తు చేసుకోగా ఇందుకు న్యాయస్థానం ఒప్పుకోలేదు. నిన్న రాత్రి దర్శన్ తీవ్ర అస్వస్థతకు గురై కళ్లు తిరిగిపడిపోయినట్లు ప్రచారం జరుగుతోంది.
రేణుకా స్వామి అనే వ్యక్తి దర్శన్ స్నేహితురాలు, నటి పవిత్ర గౌడకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపుతున్నాడని అతన్ని దారుణంగా కొట్టించి చంపేసారు. దాంతో దర్శన్‌తో పాటు పవిత్రను పోలీసులు రెండు నెలల క్రితం అదుపులోకి తీసుకున్నారు. బెయిల్ కోసం ఎంత యత్నించినా రేణుకా స్వామిని టార్చర్ పెట్టి చంపారని ఇలాంటి వారికి బెయిల్ ఇవ్వకూడదని పోలీసులు చెప్పడంతో రెండు నెలలుగా వీరిద్దరూ జైల్లోనే ఉన్నారు.