Samantha: రాజ్‌తో స‌మంత ప్రేమ‌.. ఎంత వ‌ర‌కు నిజం?

is samantha really in touch with director raj

Samantha: స‌మంత గురించి ఇప్పుడు ఓ కొత్త పుకారు సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. స‌మంత న‌టించిన ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ ద‌ర్శ‌కుడు రాజ్‌తో ప్రేమ‌లో ఉన్నార‌ట‌. ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ స‌మయంలో రాజ్‌తో స‌మంత ఎక్కువ చ‌నువుగా ఉండేవార‌ని ఆ చ‌నువు కాస్తా ప్రేమ‌గా మారిందనే టాక్ న‌డుస్తోంది.

నాగ‌చైత‌న్య శోభిత ధూళిపాల నిశ్చితార్థం త‌ర్వాత సమంత గురించి ఈ రూమ‌ర్స్ రావ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఎందుకంటే నాగచైత‌న్య స‌మంత‌ను మోసం చేసి శోభిత‌ను పెళ్లి చేసుకుంటున్నాడ‌ని తెగ ట్రోల్స్ వ‌స్తున్నాయి. వాటిని కంట్రోల్ చేసేందుకు చైతూ ఫ్యాన్స్ ఇలాంటి రూమ‌ర్స్ సృష్టిస్తున్న‌ట్లు తెలుస్తోంది. స‌మంత రాజ్‌తో రిలేష‌న్‌షిప్‌లో ఉంద‌ని ముందు రెడిట్ యాప్‌లో ఎవ‌రో రాసారు. అక్క‌డి నుంచి ఈ రూమ‌ర్ ఎక‌బాకింది.

రాజ్ పూర్తి పేరు రాజ్ నిడిమోరు. ఇత‌ను కృష్ణ డీకే అనే మ‌రో ద‌ర్శ‌కుడు క‌లిసి సినిమాలు చేస్తున్నారు. వీరిద్ద‌రిదీ తిరుప‌తి. వీరిద్ద‌రినీ రాజ్ అండ్ డీకే అనే పిలుస్తారు. చాలా స‌క్సెస్‌ఫుల్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేసిన వీరిద్ద‌రూ ఇప్పుడు స‌మంత‌తో సిటాడెల్ సిరీస్ చేసారు. దాంతో స‌మంత రాజ్‌తో చ‌నువుగా ఉంటోంద‌ని అత‌నితో ప్రేమ‌లో ఉంద‌ని రాసేస్తున్నారు. ఫ్యామిలీ మ్యాన్ 2లో స‌మంత అస‌భ్య‌క‌ర‌మైన సీన్ల‌లో న‌టించ‌డం.. అదే స‌మ‌యంలో ఆమె రాజ్‌తో రిలేష‌న్‌షిప్‌లో ఉండ‌బ‌ట్టే వీరిద్ద‌రూ విడిపోవాల్సి వ‌చ్చింద‌ని అనుకుంటున్నారు.

రాజ్‌కి ఆల్రెడీ పెళ్లైంది. అత‌ని భార్య పేరు శ్యామ‌లీ డే. వీరిద్దరూ అమెరికాలో సెటిల్ అయిపోయారు. అలాంటి పెళ్లైన వ్య‌క్తితో స‌మంత డేటింగ్‌లో ఉంద‌ని రెడిట్ యాప్‌లో ఎలా రాసారో ఏమో..! ఇప్ప‌టికే చాలా మ‌టుకు ఆంగ్ల వెబ్‌సైట్స్ కూడా వీరిద్ద‌రూ డేటింగ్ నిజ‌మే అని రాసేస్తున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు స‌మంత దీనిపై స్పందించ‌లేదు.