ధనాభివృద్ధి కోసం లక్ష్మీదేవి స్వయంగా మ‌న‌కిచ్చిన‌ స‌లహా

lakshmi mantra to get rid of financial problems

Lakshmi Devi: తిరుచానూరులో ల‌క్ష్మీదేవి ఆవిర్భ‌వించిన దినాన్ని మ‌నం కార్తీక పంచ‌మిగా చెప్పుకుంటాం. ఆ రోజున‌ ఆ త‌ల్లి త‌న శ్రీవారైన‌ నారాయ‌ణుడిని క‌లుసుకున్నారు. చాలా సంవ‌త్స‌రాల త‌ర్వాత వారిద్ద‌రూ క‌లిసి ఆ చుట్టు ప‌క్క‌లున్న దేవత‌ల‌ను రుషుల‌ను అనుగ్ర‌హించారు. అప్పుడు వాళ్లు పొంగిపోయి 24 నామాల‌తో అమ్మ‌వారిని స్తుతించారు. వాటిని ల‌క్ష్మీ చ‌తుర్వింశ‌తి నామాలు అంటారు. అయితే.. ఆ త‌ర్వాత దేవ‌తలంతా క‌లిసి వెక్కి వెక్కి ఏడ్చి తల్లీ ఇన్ని ఏళ్ల పాటు ఈ పిల్ల‌ల్ని వ‌దిలేసి వైకుంఠాన్ని వ‌దిలేసి ఎలా వెళ్లిపోయావ్. నాన్న గారు కూడా లేరు. మా బ్ర‌తుకులు ఏమైపోవాల‌మ్మా అని బాధ‌ప‌డ్డారు.

అప్పుడు అమ్మ‌వారు.. నాయ‌నా.. బాధ‌ప‌డ‌కండి. నేను మీకు ఒక వ‌రం ఇస్తున్నా. ఇప్పుడు మీరు న‌న్ను ప్రార్థించిన చ‌తుర్వింశ‌తి నామాలతో ఒక ప్ర‌క్రియ‌ను ఎవ‌రైతే చేస్తారో వాళ్ల జీవితాల్లో ల‌క్ష్మి ఎప్పుడూ వెళ్లిపోయినా మ‌ళ్లీ వెన‌క్కి తిరిగి వ‌స్తుంద‌ని చెప్పారు. ఈ వ‌రం మ‌న‌కు కూడా ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. ధ‌నం, ప‌ద‌వి, ఉద్యోగం పోయిన‌వారు ఈ పూజ చేస్తే వారికి స‌క‌ల సంప‌ద‌లు మ‌ళ్లీ వెన‌క్కి వ‌స్తాయి. ఇంత‌కీ ఈ ప్ర‌క్రియ ఏంటి? ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ పూజ‌ను మూడు విధాలుగా చేసుకోవ‌చ్చు.

ఒక‌టో విధానం ఏంటంటే. వెంక‌టేశ్వ‌ర‌స్వామి ల‌క్ష్మీదేవి క‌లిసున్న ప‌టాన్ని పూజ గ‌దిలో పెట్టుకుని 40 రోజుల పాటు బిల్వ ప‌త్రాల‌ను స‌మ‌ర్పిస్తూ ఈ 24 నామాల‌ను జ‌పించాలి. ఆడ‌వాళ్లకు మ‌ధ్య‌లో ఆటంకం వ‌స్తే.. ఆ ఐదారు రోజులు పూజ ఆపేసి.. త‌ర్వాత రోజు నుంచి కొనసాగించ‌వ‌చ్చు.

ఇక రెండో విధానం ఏంటంటే.. తిరుమ‌ల వెళ్లిన‌ప్పుడు శ్రీవారి ద‌ర్శ‌నానికి వెళ్తాం క‌దా.. అప్పుడు చాలా మంది గోవింద గోవింద అనుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే శ్రీవారి విగ్ర‌హాన్ని ద‌ర్శ‌నం చేసుకుంటున్నామో అదే స‌మ‌యంలో శ్రీవారి ఎడ‌మ వ‌క్ష‌స్థ‌లంలో ల‌క్ష్మీదేవిని చూస్తూ ఈ 24 నామాల‌ను త్వ‌ర‌గా చ‌క్క‌గా ప‌ఠిస్తే స‌రిపోతుంది.

ఇక మూడోది ఏంటంటే.. తిరుచానూరులో పద్మ‌స‌రోవ‌రం ఉంది. ఆ ప‌ద్మ‌స‌రోవ‌రంలో స్నాన‌మాచ‌రించి.. త‌డి దుస్తుల‌తోనే తూర్పు వైపు తిరిగి ఈ 24 నామాల‌ను జ‌పిస్తే మంచి ఫ‌లితం వ‌స్తుంది.

24 నామాలు ఇవే

శ్రీ శియై న‌మః

శ్రీ లోక ధాత్యై న‌మః

శ్రీ బ్ర‌హ్మ‌మాత్రే న‌మః

శ్రీ ప‌ద్మ‌నేత్రాయ న‌మః

శ్రీ ప‌ద్మ‌ముఖ్యై న‌మః

శ్రీ ప్ర‌స‌న్న‌ముఖ ప‌ద్మాయై న‌మః

శ్రీ ప‌ద్మ కాంత్యై న‌మః

శ్రీ బిల్వ వ‌న‌స్థాయై న‌మః

శ్రీ విష్ణు ప‌త్న్యై న‌మః

శ్రీ విచిత్ర క్షౌమ ధారిణ్యై న‌మః

శ్రీ పృథు శ్రోణ్యై న‌మః

శ్రీ ప‌క్వ బిల్వ ఫ‌లాపీన తుంగ‌స్త‌న్యై న‌మః

శ్రీ సుర‌క్త ప‌ద్మ ప‌త్రాభ కర‌పాద త‌ల‌యైన‌మః

శ్రీ శుభాయై న‌మః

శ్రీ సుర‌త్నాంగ‌ద కేయూర కాంచీ నూపుర శోభితాయై న‌మః

శ్రీ య‌క్ష క‌ర్ద‌మ సంలిప్త స‌ర్వాంగాయై న‌మః

శ్రీ క‌ట‌కోజ్వ‌లాయైన‌మః

శ్రీ మాంగ‌ళ్య భ‌ర‌ణై శ్చిత్రైః ముక్తా హారైర్వి భూషితాయై న‌మః

శ్రీ త‌టంకై ర‌వ‌తంసై శ్చ శోభ‌మాన ముఖాంబుజాయై న‌మః

శ్రీ ప‌ద్మ‌హ‌స్తాయై న‌మః

శ్రీ హ‌రివ‌ల్ల‌భాయై న‌మః

శ్రీ బుగ్యజుస్సామ రూపాయై న‌మః

శ్రీ విద్యాయై న‌మః

శ్రీ అబ్ధిజాయై న‌మః