Harish Shankar: హీరోయిన్‌కి లేని బాధ నీకెందుకు రా?

harish shankar slams trollers who are questioning age gap

Harish Shankar: హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ సినిమా 15న రిలీజ్ కాబోతోంది. ఇందులో ర‌వితేజ‌కు జోడీగా భాగ్య‌శ్రీ బోర్సే న‌టించారు. అయితే ర‌వితేజ కంటే భాగ్య‌శ్రీ 20 ఏళ్లు చిన్న‌ది. దాంతో హ‌రీష్ శంక‌ర్‌పై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ మొద‌లైంది. దీనిపై హ‌రీష్ శంక‌ర్ స్పందించారు. సినిమాలో క్యారెక్టర్‌కి స్క్రీన్ ఏజ్ అని ఒకటి ఉంటుందని… ఇప్పుడు ఆ ఏజ్ హీరో కి ఆ ఏజ్ హీరోయిన్‌నే పెడ‌తారా అని ప్ర‌శ్నించారు. ఇది సినిమా అని ఒక కామన్ సెన్స్ లేకుండా ఏజ్ గ్యాప్ ట్రోల్స్ ఏంటి అని మండిప‌డ్డారు. సంత‌కం చేసిన హీరోయిన్‌కి లేని బాధ మీకు ఏంట్రా అని స‌మాధాన‌మిచ్చారు.