ఆరేళ్ల బాలిక‌ను రేప్ చేసి.. ఆ వెంట‌నే మేక‌పై అత్యాచారం

man rapes a girl and a goat

Viral News: ఓ న‌ర‌రూప రాక్ష‌సుడు అభం శుభం తెలీని ఆరేళ్ల బాలిక ప‌ట్ల పైశాచిక‌త్వం ప్ర‌ద‌ర్శించి.. ఆ వెంట‌నే ఓ మూగ‌జీవిపై కూడా అత్యాచారం చేసాడు. ఈ దారుణ ఘ‌ట‌న ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో చోటుచేసుకుంది. బులంద్‌షెహ‌ర్ ప్రాంతానికి చెందిన గ‌జేంద్ర సింగ్ అనే వ్యక్తి నిన్న ఉద‌యం తెలిసిన వ్య‌క్తి ఇంటికి ఓ ప‌ని మీద వెళ్లాడు. అక్క‌డ ఆరేళ్ల బాలిక ఒంట‌రిగా క‌నిపించ‌డంతో పాప‌పై అత్య‌చారానికి పాల్ప‌డ్డాడు.

అయినా అత‌నికి కామ దాహం తీర‌లేదు. అదే ఇంటి వెనుక క‌ట్టేసి ఉన్న ఓ మేక‌ను కూడా రేప్ చేసాడు. స్థానిక ప్రాంతంలో ADOగా ప‌నిచేస్తున్న గజేంద్ర సింగ్‌ను బాలిక ఫిర్యాదుతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాప ఎందుకో భ‌య‌ప‌డి ఏడుస్తుంటే ఓదార్చానని.. తాను ఎలాంటి త‌ప్పు చేయ‌లేద‌ని నాట‌కాలాడాడు. పాప‌కు వైద్య ప‌రీక్ష‌లు చేయ‌డంతో అత్యాచారానికి గురైన‌ట్లు తెలిసింది. ఆ కామాంధుడి వ‌ల్ల అత్యాచారానికి గురైన మేక‌ను కూడా ప‌శువుల హాస్పిట‌ల్‌కు చికిత్స నిమిత్తం త‌ర‌లించారు.