AI దోచుకోలేని ఉద్యోగాలు ఇవే

these jobs cannot be replaced by ai

AI: ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగ మార్కెట్‌ను అత‌లాకుతలం చేస్తోంది. ఇప్ప‌టికే ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ వ‌ల్ల చాలా ఉద్యోగాలపై ప్ర‌భావం ప‌డింది. చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు కూడా. అయితే.. ఎన్నేళ్లు గ‌డిచినా AI దోచుకోలేని కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

థెర‌పిస్ట్‌లు, కౌన్సిల‌ర్లు

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ భర్తీ చేయ‌లేని వృత్తి ఇది. థెర‌పిస్ట్, కౌన్సిల‌ర్లు పేషెంట్ల‌తో ఎమోష‌న‌ల్‌గా ఉండాలి. ఒక మ‌నిషిగా వారికి ధైర్యం చెప్పాలి. ఆ ధైర్యం ఆ ఆప్యాయ‌త ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ఇవ్వ‌లేదు.

ఆర్టిస్ట్

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆర్ట్‌ని డిజైన్ చేయొచ్చు కానీ ఆర్టిస్ట్‌ని డిజైన్ చేయ‌లేం. తియ్య‌ని గొంతుతో పాడే పాట‌లు దానిపై ప‌ట్టుండే గాయ‌కులు మాత్ర‌మే పాడ‌గ‌ల‌రు. ఇలాంటి ఆర్టిస్ట్‌ల‌ను AI ఏమీ చేయ‌లేదు.

ఎన‌లిస్ట్, స్ట్రాటజిస్ట్

ఒక ఐడియాపై క్రియేటివ్‌గా ఆలోచించి మంచి స‌ల‌హాలు ఇచ్చేవారు ఎన‌లిస్ట్‌లు, స్ట్రాట‌జిస్ట్‌లు. ఈ క్రియేటివ్ ఐడియాల‌ను AI ఇవ్వ‌లేదు.

శాస్త్రవేత్త‌లు

ఒక ఔష‌ధాన్ని క‌నిపెట్ట‌డం అంటే మామూలు విష‌యం కాదు. ఎన్నో ఏళ్ల ప‌రిశోధ‌నా అనుభ‌వం ఉన్న‌వారికే ఇది సాధ్యం. శాస్త్రవేత్త‌లు చేసే ప‌ని AI మాత్రం చేయ‌లేదు. కాక‌పోతే వారి ప‌రిశోధ‌న‌ల్లో మాత్రం ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ఉప‌యోగ‌ప‌డుతుంది.

లాయ‌ర్లు

కోర్టుల్లో అన‌ర్గ‌ళంగా వాదించి కేసును గెలిపించే లాయ‌ర్ల ఉద్యోగాల‌కు ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌తో ఎలాంటి ముప్పు లేదు. ఒక‌వేళ రోబో లాయ‌ర్లు అందుబాటులోకి వచ్చినా క్లైంట్లు వారిని న‌మ్ముకుని కోర్టు గ‌డ‌ప తొక్క‌లేరు.

క‌స్ట‌మ‌ర్ స‌ర్వీస్ రెప్రెజెంటేటివ్స్

క‌స్ట‌మ‌ర్ల‌కు ఏదైనా స‌మ‌స్య వ‌స్తే దానిని మృదువుగా ప‌రిష్క‌రించేది స‌ద‌రు మ‌నిషి మాత్ర‌మే. అంతేకానీ.. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ద్వారా క‌స్ట‌మ‌ర్ల స‌మ‌స్య‌ల‌ను తీర్చాల‌నుకుంటే అది పొర‌పాటే.

డాక్ట‌ర్లు, న‌ర్సులు

వైద్య రంగాన్ని కూడా AI ట‌చ్ చేయ‌లేదు. కాక‌పోతే స‌ర్జ‌రీల విష‌యాల్లో రోబోటిక్ స‌ర్జ‌రీలు అందుబాటులో ఉన్నాయి. అలాగ‌ని రోబోలు స‌ర్జరీలు చేయ‌డం అస్స‌లు కుద‌ర‌ని ప‌ని.

జ‌ర్న‌లిస్ట్‌లు

ప‌త్రికా విలేక‌ర్ల ఉద్యోగాల‌కు కూడా AIతో ఢోకా ఉండ‌దు. కాక‌పోతే ఓ టీవీ ఛానెల్ ఇప్ప‌టికే రోబోని యాంక‌ర్‌గా నియ‌మించింది. కానీ అది ఎక్కువ రోజులు వ‌ర్క‌వుట్ అవ్వ‌లేదు. ప్ర‌జ‌ల‌కు స‌రైన స‌మాచారాన్ని చేర‌వేసేది ఒక జర్న‌లిస్ట్ మాత్ర‌మే. రాసే ప్ర‌తి స్టోరీకి హ్యూమ‌న్ ట‌చ్‌ని జోడిస్తేనే అది క్లిక్ అవుతుంది.

టీచ‌ర్లు

పిల్ల‌ల భ‌విష్య‌త్తును తీర్చిదిద్దేది గురువులే. వారి భ‌విష్య‌త్తుని తీసుకెళ్లి రోబోలు, ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ చేతుల్లో పెడితే అన‌ర్థాల‌కు దారి తీస్తుంది. చ‌క్క‌గా విలువ‌ల‌తో కూడిన విద్య‌ను బోధించే టీచ‌ర్లు ఉన్నంత వ‌ర‌కు విద్యార్థులు ఎంతో ఎదుగుతారు.