Muhammad Yunus: రాక్ష‌సి వెళ్లిపోయింది.. షేక్ హ‌సీనాపై తాత్కాలిక ప్ర‌ధాని వ్యాఖ్య‌లు

bangladesh interim leader Muhammad Yunus calls sheikh hasina a monster

Muhammad Yunus: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన మ‌హ్మ‌ద్ యూన‌స్.. మాజీ ప్ర‌ధాని షేక్ హ‌సీనాపై చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దంగా మారాయి. బాధ్య‌త‌లు స్వీక‌రించిన అనంత‌రం ఆయ‌న అల్ల‌ర్ల‌కు పాల్ప‌డి హ‌సీనాను సొంత దేశం నుంచి త‌రిమేసిన విద్యార్థుల‌ను ఉద్దేశిస్తూ ప్రసంగించారు. “” మీరు రాక్ష‌సిని త‌రిమేసి మంచి ప‌నిచేసారు. న‌న్ను ఎన్నుకుని నాపై బాధ్య‌త ఉంచారు. మీరు చేసింది మామూలు విష‌యం కాదు. ఇప్పుడు ఈ తాత్కాలిక ప్ర‌భుత్వం తీసుకునే నిర్ణ‌యాలు కొంద‌రికి న‌చ్చ‌వ‌చ్చు.. మ‌రికొంద‌రికి న‌చ్చ‌కపోవ‌చ్చు “” అని వెల్ల‌డించారు. యూన‌స్ త‌న స‌ల‌హాదారు క‌మిటీలో అల్ల‌ర్ల‌ను ముందుండి న‌డిపించిన న‌హిద్ ఇస్లాం, ఆసీఫ్ మ‌హ్మూద్ అనే ఇద్ద‌రు విద్యార్థుల‌కు అవ‌కాశం ఇచ్చారు.