Duvvada Srinivas: మాధురితో నాకు శారీరక సంబంధం లేదు
Duvvada Srinivas: తన భార్య దువ్వాడ వాణి ఆరోపిస్తున్నట్లు తనకు మాధురితో శారీరక సంబంధం లేదని అన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. గత ఐదు రోజులుగా దువ్వాడ ఇంటి గుట్టు టెక్కలిలో సంచలనం రేపుతోంది. ఈ నేపథ్యంలో మాధురి కారు రోడ్డు ప్రమాదానికి గురికావడం.. అది ప్రమాదం కాదని వాణి తనపై పాల్పడుతున్న వ్యక్తిత్వ హనన వ్యాఖ్యల కారణంగా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని అనడంతో ఇది కాస్తా రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఈ నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ.. వాణికి విడాకుల నోటీస్ పంపించానని.. ఈ మొత్తం డ్రామాలో ప్రధాన విలన్ ఎవరైనా ఉన్నారంటే అది వాణి తండ్రే అని ఆరోపించారు. మాధురితో తనకున్నది శారీరక సంబంధం కాదని.. ఒక మగవాడు, ఆడది స్నేహితులుగా ఉంటే దానికి శారీరక అక్రమ సంబంధంగా ఎందుకు మారుస్తారని ప్రశ్నించారు. వాణి డిమాండ్లు చెప్తే తాను ఐదు నిమిషాల్లో పరిష్కరిస్తారని.. ఆ డిమాండ్సేంటో చెప్పకుండా తనను, మాధురిని పలాస వెళ్లిపోవాలని చెప్తోందని.. దీనిని బట్టి చూస్తుంటే టెక్కలిలో కేవలం దువ్వాడ వాణి మాత్రమే రాజకీయంగా ఎదగాలని కుట్రలు పన్నుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోందని ఆరోపించారు.