Rapex: రేప్ నుంచి కాపాడే పరికరం.. ఎందుకు అందుబాటులో లేదో తెలుసా?
Rapex: పై ఫోటోలో కనిపిస్తున్న పరికరాన్ని చూసారా? ఈ పరికరం పేరు రేపెక్స్. ఇది మహిళలను రేప్ నుంచి కాపాడుతుందట. సౌతాఫ్రికాకి చెందిన మెడికల్ టెక్నీషియన్ సోనెట్ ఎహ్లర్స్ ఈ పరికరాన్ని 2005లో తయారుచేసింది. ఈ రేపెక్స్ పరికరం చూడటానికి కండోమ్‌లా ఉంటుంది. దీని బయట షార్ప్ పళ్లు ఉంటాయి. దీనిని మహిళలు యోని భాగంలో ధరించాలి. ఒకవేళ దీనిని ధరించిన వారు రేప్‌కి గురవుతుంటే.. మగవాడి అంగానికి ఈ రేపెక్స్ పరికరం అతుక్కుపోతుంది. దానిని అంగం నుంచి తొలగించాలంటే వైద్యుల వల్లే వీలవుతుంది.
మరి ఆడవారికి ఎంతో పనికొచ్చే ఈ పరికరం ఎందుకు మార్కెట్‌లో అందుబాటులో లేదు అనుకుంటున్నారా? కొందరు విమర్శకులు ఈ పరికరాన్ని చూసి ఇది మధ్యయుగంలో శిక్ష వేసేందుకు వినియోగించేవారని కామెంట్స్ చేసారు. దాంతో దీనిని అంతర్జాతీయ మార్కెట్‌లోకి ప్రవేశపెట్టలేకపోయారు. దీనిని కనీసం సౌతాఫ్రికా మహిళలైనా ధరించారా? ఎవరినైనా రేప్ నుంచి ఈ పరికరం కాపాడిందా అనే విషయాలు కూడా బయటికి రాలేదు. ఈ రేపెక్స్ కానీ మార్కెట్‌లో రిలీజ్ అయితే.. మహిళలకు ఎంత వరకు ఉపయోగపడుతుంది అనేది తెలుస్తుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.