Vinesh Phogat: ఒలింపిక్ సిల్వర్ మెడల్.. కేసు 11కు వాయిదా
Vinesh Phogat: భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫోగాట్‌కు వెండి పతకం ఇవ్వాలన్న వాదనలను CAS ఈ నెల 11కు వాయిదా వేసింది. ప్రముఖ లాయర్ హరీష్ సాల్వే ఈ కేసులో తన వాదనలను వినిపించారు. కేవలం 100 గ్రాముల అధిక బరువు ఉందని రెజ్లింగ్ విభాగంలో వినేష్‌ను ఫైనల్స్‌కి వెళ్లనివ్వకుండా ఒలింపిక్స్ కమిటీ అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. దాంతో వినేష్ రెజ్లింగ్‌కు స్వస్తి పలికారు. సెమీ ఫైనల్స్ వరకు వచ్చిన ఏకైక భారతీయ రెజ్లర్ కావడంతో కనీసం ఆమెకు వెండి పతకాన్ని అయినా ఇవ్వాలని కోరుతూ CASలో పిటిషన్ వేసారు. ఈ కేసు విషయాన్ని పరిశీలించడానికి తమకు సమయం కావాలని కోరుతూ తుది తీర్పును 11న వెల్లడించనున్నారు.