Hema: బాధ‌తో నేను ఆత్మ‌హ‌త్య చేసుకుని ఉంటే?

actress hema speaks for the first time after banglore rave party incident

Hema: బెంగ‌ళూరు రేవ్ పార్టీలో అరెస్టైన హేమ‌.. ఇప్పుడు బెయిల్‌పై ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఆమె తొలిసారి రేవ్ పార్టీ గురించి క్లారిటీ ఇచ్చారు. బెంగ‌ళూరులో త‌న త‌మ్ముడులాంటి వ్య‌క్తి పుట్టిన‌రోజు ఉందంటే మే 18న వెళ్లాన‌ని.. ఆ రేవ్ పార్టీ అనేది 19న జ‌రిగింద‌ని.. దాని గురించి కోర్టులో తీర్పు వ‌చ్చేవ‌ర‌కు తాను ఏమీ చెప్ప‌లేన‌ని అన్నారు. బ‌ర్త్‌డే పార్టీ అంటే వెళ్లాన‌ని అక్క‌డ డ్ర‌గ్స్ ఉన్నాయ‌ని తెలిసుంటే అస్స‌లు వెళ్లేదానిని కాదని అన్నారు.

త‌న‌కు జూన్ 3న త‌న సాంపుల్స్ తీసుకుని డ్ర‌గ్స్ టెస్ట్ చేస్తే అంత‌కుముందే హేమ డ్ర‌గ్స్ తీసుకున్నారు అని మీడియా వాళ్లు రాసేసార‌ని వాపోయారు. ఆ వార్త చ‌దివి త‌న త‌ల్లి వారం రోజుల పాటు అన్నం తిన‌లేద‌ని.. ఈ బాధ‌తో త‌ను, త‌న త‌మ్ముడు, త‌న త‌ల్లి ఆత్మ‌హ‌త్య చేసుకుని ఉంటే ఎవ‌రు బాధ్య‌త వ‌హించేవారంటూ క‌న్నీరుపెట్టుకున్నారు. ఒక‌వేళ ఆత్మ‌హ‌త్య చేసుకున్నా డ్ర‌గ్స్ తీసుకుంది కాబ‌ట్టి అవ‌మానంతో చ‌నిపోయింది అని రాసేస్తారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేసారు. తాను రేవ్ పార్టీలో ఉన్నానో లేదో డ్రగ్స్ తీసుకున్నానో లేదో కోర్టు వెల్ల‌డిస్తుంద‌ని.. ఆ త‌ర్వాత మ‌ళ్లీ మీడియా ముందుకు వ‌చ్చి ఏం జ‌రిగిందో అన్నీ వివ‌రిస్తాన‌ని వెల్ల‌డించారు.