Sobhita Dhulipala: అక్కినేని కోడలి సొంత చెల్లి.. పేరు సమంత
Sobhita Dhulipala: నాగచైతన్య, శోభిత ధూళిపాల త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. మొన్న 8న వీరి నిశ్చితార్థం గ్రాండ్గా జరిగింది. ఎప్పుడైతే వీరి నిశ్చితార్థ ఫోటోలు బయటికి వచ్చాయో అందరూ చై మాజీ భార్య సమంతకి సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. సమంతని మోసం చేసి చై మరో అమ్మాయిని చేసుకుంటున్నాడని.. సమంతతో ఉంటుండగానే శోభితతో సంబంధం పెట్టుకున్నాడని ఎవరికి తోచించి వారు రాసేస్తున్నారు. కానీ నిజమేంటో మనకు తెలీదు. అలాంటప్పుడు వారి పర్సనల్స్ జోలికి వెళ్లకూడదు. అయితే.. ఇప్పుడు మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. శోభితకు ఓ సొంత సోదరి ఉంది. ఆమె పేరు కూడా సమంతనే కావడం గమనార్హం. శోభిత తన చెల్లెలి గురించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన ప్రతిసారీ చైతన్యకు మరదలి రూపంలో సమంత దొరికింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.