Nagarjuna: అందుకే హడావుడిగా నిశ్చితార్ధం చేయాల్సి వచ్చింది
Nagarjuna: అక్కినేని నాగచైతన్య.. నటి శోభిత ధూళిపాలల నిశ్చితార్థం నిన్న ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. నాగచైతన్య నివాసంలో ఫ్యామిలీ ఎఫైర్లా ఈ నిశ్చితార్థాన్ని నిర్వహించారు. అయితే ఇంత హడావుడిగా ఎందుకు నిశ్చితార్థం చేయాల్సి వచ్చిందో అక్కినేని నాగార్జున వెల్లడించారు. నిన్న తేదీ, నెల, సంవత్సరం అన్నీ కలిపితే 888 వచ్చిందని.. అది చాలా ప్రత్యేకంగా ఉండటంతో నిశ్చితార్థం నిర్వహించాలనుకున్నామని తెలిపారు. ఈ నిశ్చితార్థానికి ముందు మీరిద్దరూ పెళ్లికి సిద్ధమేనా అని వారిని అడిగామని.. అప్పుడు వారిద్దరూ 100% సిద్ధంగా ఉన్నామని చెప్పడంతో హడావుడిగా నిశ్చితార్థ ఏర్పాట్లు చేసామని అన్నారు.
శోభిత చైతన్య కంటే ముందే తనకు బాగా పరిచయం అని.. శోభిత చైల పరిచయం కేవలం రెండేళ్ల నాటిదేనని.. తనకు శోభిత ఆరేళ్ల నుంచి తెలుసని తెలిపారు. గూఢచారి సినిమాలో తన నటన ఎంతో బాగుందని.. ఆమె చాలా అందంగా కనిపించారని కూడా సక్సెస్ మీట్లో చెప్పానని పేర్కొన్నారు. శోభిత అన్ని విషయాల పట్ల అవగాహన కలిగిన పిల్ల అని కితాబిచ్చారు. ఇక పెళ్లి గురించి ప్రస్తావిస్తూ.. పెళ్లికి మాత్రం చాలా సమయం ఉందని వెల్లడించారు.