ఉమ్మడి విశాఖ MLC ఉప ఎన్నిక‌లు: కూట‌మి నుంచి బ‌రిలోకి TDP అభ్య‌ర్ధి

alliance chooses tdp candidate for vizag mlc elections

Vizag MLC by-elections: ఉమ్మడి విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న స‌మ‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ కూట‌మి ప్ర‌భుత్వం తెలుగు దేశం పార్టీ అభ్య‌ర్ధిని నిల‌బెట్టాల‌ని నిర్ణ‌యించింది. ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు పార్టీ స‌భ్యుల‌ను క‌లిసి కూటమి తరఫున తెలుగు దేశం పార్టీ అభ్యర్థిని బరిలో దింపాలని నిర్ణయించారు. ఉండవల్లిలోని తన నివాసంలో విశాఖ జిల్లా నేతలతో ఆయన సమావేశం అయ్యారు. ప్రస్తుత భేటీలో MLC అభ్యర్థిని చంద్ర‌బాబు ఖరారు చేయనున్నారు. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ త‌ర‌ఫు నుంచి బొత్స స‌త్య‌నారాయ‌ణ బ‌రిలోకి దిగ‌నున్న సంగ‌తి తెలిసిందే.