Viral News: అటెండెన్స్ కావాలా? అయితే ఓ ముద్దివ్వు
Viral News: స్కూల్లో పనిచేస్తున్న ఓ టీచర్ తాను తరగతులకు హాజరైనట్లు అటెండెన్స్ వేయమని కోరగా.. మరో టీచర్ ఆమెను ముద్దు అడగడం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాఠశాలల్లో డిజిటల్ అటెండెన్స్ సిస్టమ్ ఏర్పాటుచేసారు. టీచర్లంతా ఈ సిస్టమ్ ద్వారానే తమ హాజరును నమోదు చేయాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలోఉన్నావ్ ప్రాంతానికి చెందిన ఓ టీచర్ తన అటెండెన్స్‌ని సిస్టమ్‌లో అప్డేట్ చేయమని మరో టీచర్‌ను అడగ్గా.. అతను ఒక ముద్దిస్తే అప్పుడు చేస్తానని చెప్పడం వివాదాస్పదంగా మారింది. ఆ సమయంలో ఎవరో వీడియో తీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కారణంగా ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఉపాధ్యాయులు ఈ డిజిటల్ సిస్టమ్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేయడంతో ప్రస్తుతం దీనిని తాత్కాలికంగా నిలిపివేసారు.