SSMB 29: మ‌హేష్ హ‌నుమంతుడి క్యారెక్ట‌ర్లోనా?

Hyderabad: RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు దర్శకధీరుడు రాజమౌళి(SS Rajamouli). ఆస్కార్(Oscar)​ వేడుకల్లో హాలీవుడ్(Hollywood)​ స్టార్ డైరెక్టర్స్ స్టీవెన్ స్పీల్‌బెర్గ్, జేమ్స్ కామెరాన్ నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారు. ఇక, ఇప్పుడు అందరి దృష్టంతా రాజమౌళి తదుపరి చిత్రాలపైనే ఉంది. తన తదుపరి సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) తో ఉండబోతుందని రాజమౌళి(SS Rajamouli) ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ చిత్రం ఇండియానా జోన్స్ తరహాలో అడ్వెంచర్ కథతో ఉండబోతుందని రాజమౌళి వెల్లడించాడు.

కాగా ఈ సినిమాకి సంబంధించిన ఇంటరెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకి వచ్చింది. ఈ చిత్రంలో మహేష్ క్యారెక్టర్ రామాయణంలోని హనుమంతుడి పాత్రను పోలి ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. అడవుల్లో జరిగే అక్రమాల పై మహేష్ బాబు(Mahesh Babu) పోరాడనున్నాడట. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంతో ఈ సినిమా సాగబోతోంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ సినిమా పట్టాలు ఎక్కనున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా షూటింగ్ అమెజాన్ అడవుల్లో మొదలు కానున్నట్లు తెలుస్తుంది. ఇందు కోసం రాజమౌళి అండ్ టీం భారీ కసరత్తు చేస్తున్నారట.
అంతేకాదు ఈ సినిమా కోసం రాజమౌళి హాలీవుడ్ VFX టెక్నీషియన్స్ తో అగ్రిమెంట్ ని కూడా చేసుకున్నారు. ఈ సినిమా నిర్మాణంలో భాగం అయ్యేందుకు బడా సంస్థలు సోనీ పిక్చర్స్ (Sony Pictures), డిస్నీ (Disney) పోటీ పడుతున్నాయి. ఆల్రెడీ సోనీ పిక్చర్స్ రాజమౌళితో కూడా చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ సినిమా మూడు భాగాలుగా రాబోతుంది అంటూ ఒక వార్త హల్ చల్ చేస్తుంది. ఏదైనా కచ్చితంగా తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.